వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్! మందేసి మాట్లాడావా?: ఏకిపారేసిన రేవంత్, జానా, కిషన్ వీహెచ్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం విపక్షాల నేతలు అదే స్థాయిలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాగుబోతు మాటలు..

తాగుబోతు మాటలు..

మందేసి తాగుబోతు మాటలు మాట్లాడుతావా? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలుగుదేశం భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు అధికారం అప్పగించగానే కేసీఆర్ సర్వం తానేనని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరామ్‌ను వాడు, వీడు అని సంభోదిస్తూ కేసీఆర్ మాట్లాడడం సబబా? అని ప్రశ్నించారు. అయినా కోదండరాం తప్పు ఏం మాట్లాడారని ఆయన నిలదీశారు. సింగరేణి ఎన్నికల్లో ప్రతిపక్షాల అనైక్యత వల్లే టీఆర్ఎస్ గెలిచిందని ఆయన అన్నారు.
తామంతా ఏకతాటిపైకి వస్తే టీఆర్ఎస్ గెలిచేదా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని..

తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకుని..

కేసీఆర్ ఇంటికి కోదండరాం ఇల్లు ఎంత దూరమయో కోదండరాం ఇంటికి కేసీఆర్ ఇల్లు కూడా అంతే దూరమని ఆయన గుర్తు చేశారు. నువ్వు వాడు, వీడు అని మాట్లాడితే నిన్ను ఎలా సంభోధించాలని రేవంత్ ప్రశ్నించారు. తాగుబోతు అయినా తల్లిని తల్లి, చెల్లిని చెల్లి అంటాడని, కానీ నువ్వు మాత్రం అలా కాదని ఆయన మండిపడ్డారు. ఇందుకేనా తెలంగాణ ప్రజలు నీకు పట్టంకట్టింది? అని ఆయన నిలదీశారు. పేదోడికి మేలు చెయ్యాలన్న టీడీపీ విధానం నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం మానేసి, తెలంగాణలో టీడీపీ లేదని అంటావా? అని ఆయన ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తెలంగాణ వీరులు, కోదండరాం దేశద్రోహా? అని ఆయన నిలదీశారు. ఏమ్మాట్లాడుతున్నావో అర్ధమవుతోందా? అని ఆయన అడిగారు. సంస్కారహీనంగా మాట్లాడవద్దని, తెలంగాణ ప్రజలు ఇందుకు అధికారం అప్పగించలేదని రేవంత్ తెలిపారు.

నిప్పులు చెరిగిన కిషన్

నిప్పులు చెరిగిన కిషన్

భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా.. తెలంగాణ వచ్చేదే కాదని బీజేఎల్పీ నేత జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ మేమే తెచ్చామని కేసీఆర్ అనడం సరికాదన్నారు. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ తాత్సారం చేస్తుంటే పార్లమెంట్‌లో సుష్మాస్వరాజ్ గట్టిగా మాట్లాడారని కిషన్‌రెడ్డి అన్నారు. అంతేగాక ప్రత్యక్ష పోరాటానికి దిగింది బీజేపీ పార్టీనేనని, ఢిల్లీ కోర్టుల్లో బీజేపీ నేతలపై కేసులు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో కులాలను తీసుకురావడం కేసీఆర్‌కు తగదని, 1200 మంది బలిదానాలను కేసీఆర్ తక్కువ చేసి చూపుతున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మిలియన్ మార్చ్, సాగర హారంలో కేసీఆర్ పాల్గొనలేదని, కేసీఆర్ ఒంటెత్తు పోకడలతో ఉద్యమం నీరుగారి పోతుంటే కోదండరాం నేతృత్వంలోని జేఏసీ ముందుకు తీసుకెళ్లిందని కిషన్‌రెడ్డి అన్నారు. డబ్బు, మద్యంతో సింగరేణి ఎన్నికల్లో గెలిచి విర్రవీగుతున్నారని మండిపడ్డారు.

శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది కేసీఆరే

శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది కేసీఆరే

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరల్డ్ కప్ గెలచినట్లు ఫీలవుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతారావు ధ్వజమెత్తారు. శనివారం ఆయనమాట్లాడుతూ... కూతురు కవిత కోసం కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డారన్నారు. అలాగే గత ఎన్నికల్లో శ్రీకాంతాచారి తల్లిని ఓడించింది కేసీఆరేనని వీహెచ్ అన్నారు. అలాగే కోదండరాంపై ఇంత దిగజారి మాట్లాడడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు కాబట్టే కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నామని హనుమంతారావు పేర్కొన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దొర అయితే సైన్యంలో పనిచేసే వారు కాదన్నారు. ముఖ్యంత్రి కేసీఆర్ ని పొగడడమే గవర్నర్ పనిగా పెట్టుకున్నారని, గవర్నర్ ఓ టీఆర్ఎస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని వీహెచ్ అన్నారు.

 కేసీఆర్ తీరు జుగుప్సాకరం

కేసీఆర్ తీరు జుగుప్సాకరం

తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల తీరు జుగుప్సాకరంగా ఉందని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ కేసీఆర్ ఒక్కరి వల్లే ఏం రాలేదని చెప్పారు. శుక్రవారం మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సీనియర్లు, పెద్దలంటే గౌరవం లేదని అన్నారు. దేశానికి సేవ చేసిన నెహ్రూ, ఇందిరాలను ఇష్టమొచ్చినట్లు అంటారా? అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓడించడమే కేసీఆర్ కు సరైన గుణపాఠం అవుతుందని అన్నారు. గతంలో హెచ్చరించినా కేసీఆర్ పరుష పదజాలాన్ని వదలడం లేదని మండిపడ్డారు. జేఏసీకి అందరం కలిసే పేరు పెట్టామని అన్నారు. టికెట్ కోసం, పదవుల కోసం తానెప్పుడు ఎవరి చుట్టూ తిరగలేదని.. అవే తనను వెతుక్కుంటూ వచ్చాయని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మంచి మాటలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.

English summary
TDP, Congress, BJP leaders Revanth Reddy, Jana Reddy and Kishan Reddy and V Hanumantha Rao lashed out at Telangana CM K Chandrasekhar Rao for his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X