వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గుపడాలి, ప్రతిదాడి తప్పదు, కోమటిరెడ్డి పారిపోరు: బొడ్డుపల్లి హత్యపై రేవంత్, జానా

|
Google Oneindia TeluguNews

నల్గొండ: బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య వంటి సంఘటనలు జరుగుతుండటంపై కేసీఆర్ ప్రభుత్వం సిగ్గుపడాలని కాంగ్రెస్ శాసన సబా పక్ష నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఆదివారం నల్గొండలో బొడ్డుపల్లి సంతాప సభ నిర్వహించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో విచారణ జరుగుతున్న తీరు దారుణంగా ఉందని జానా అన్నారు.

హోంశాఖ పరువును దిగజార్చిందన్నారు. 2019లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ఈ హత్య వెనుక ఉన్న టీఆర్ఎస్ నేతల పేర్లను బయటపెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మళ్లీ గెలవాలనుకుంటోందని ధ్వజమెత్తారు.

శ్రీనివాస్ హత్య: 'కేసీఆర్‌ను అంటారా, కోమటిరెడ్డి పాములా పెంచారు, కాల్ లిస్ట్ ఇవ్వు' శ్రీనివాస్ హత్య: 'కేసీఆర్‌ను అంటారా, కోమటిరెడ్డి పాములా పెంచారు, కాల్ లిస్ట్ ఇవ్వు'

తొడకొడితే తట్టుకుంటారా, ప్రతిదాడి తప్పదు

తొడకొడితే తట్టుకుంటారా, ప్రతిదాడి తప్పదు

మా కార్యకర్తలు తొడగొడితే టీఆర్ఎస్ కార్యకర్తలు తట్టుకుంటారా అని జగ్గారెడ్డి మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి చంచాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈసారి కాంగ్రెస్ జోలికి వస్తే 30 లక్షల మంది కార్యకర్తలతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ కళ్లు తెరవకుంటే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు.

సీబీఐ విచారణ జరపాలి

సీబీఐ విచారణ జరపాలి


రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హంతకులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. శ్రీనివాస్ హత్య వెనుక అసలు నిందితులు ఎవరో తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం పైన, ఈ పోలీసులపై ఈ విషయంలో తనకు నమ్మకం లేదన్నారు.

ఐదుగురికి బెయిల్ వచ్చింది

ఐదుగురికి బెయిల్ వచ్చింది

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేసింది ఒకరు అయితే, పోరాడింది ఒకరు అయితే, పదవులు అనుభవిస్తోంది మాత్రం మరొకరు అని రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులు దొరగారి గడివద్ద కాపలా కాస్తున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో 11 మంది నిందితుల్లో 5గురికి బెయిల్ వచ్చిందని, అంటే విచారణ మమ అన్నట్లుగా చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది

ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది

బొడ్డుపల్లి హత్య పకడ్బందీగా జరిగినట్లుగా అర్థమవుతోందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సుమారు నాలుగు గంటల పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లలేదని, అంటే ప్లాన్‌తో జరిగిన హత్యగానే భావించవచ్చునని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమయిందని ప్రశ్నించారు. నిమిషాల్లో సంఘటన స్థలానికి వెళ్తామని చెప్పే పోలీసులు నాలుగు గంటల పాటు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అయితే ఏకంగా పోలీసు అధికారే కనిపించకుండా పోయారన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే నాయకులు హత్యగావించబడుతున్నారని, పోలీసులు ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో స్టేషన్ వదిలి పారిపోతున్నారని, ఇదీ రాష్ట్రంలో జరుగుతోందన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులను చంపుకుంటూ పోతే చూస్తూ కూర్చోమన్నారు. ఇలాంటి హత్యలు చూసి కాంగ్రెస్ భయపడదన్నారు. కోమటిరెడ్డి సోదరులు అంతకంటే భయపడేవారు కాదన్నారు. కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో కాంగ్రెస్‌కు, కోమటిరెడ్డికి తెలుసునని చెప్పారు. ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు.

English summary
Congress demanded CBI probe into Nalgonda leader Boddupalli Srinivas murder on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X