వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కు సుప్రీం షాక్ : ఇంప్లీడ్ పిటిషన్ తిరస్కరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫిరాయింపు ఎమ్యెల్యేలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే స్పీకర్ కు వినతిపత్రం అందజేసిన నేతలు.. స్పీకర్ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. సుప్రీంను ఆశ్రయించారు.

పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాగా, టీడీపీ తరుపున ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే కొద్ది నెలల కిందటే ఎర్రబెల్లి టీడీపీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరడంతో పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాత్రమే దీనిపై పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే టీడీపీ నుంచి ఎర్రబెల్లి బయటకువెళ్లిపోవడంతో.. కేసు విచారణలో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

Revanth petition was rejected in supreme court

ఈ నేపథ్యంలో.. తాజాగా రేవంత్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే విచారణకు స్వీకరించకుండా పిటిషన్ ను తిరస్కరించడంతో రేవంత్ ఒకింత షాక్ తిన్నారు. ఇదే కేసుకు సంబంధించి స్పీకర్ కు సైతం సుప్రీం నోటీసులు జారీ చేయగా, కేసులో తాను ఇంప్లీడ్ అయి టీడీపీ నుంచి బయటకు వెళ్లిన నేతలను తీవ్ర ఇరకాటంలో పెట్టాలని ప్లాన్ చేశారు రేవంత్. కాగా సుప్రీం రేవంత్ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన ప్లాన్ బెడిసికొట్టినయింది.

English summary
Its a shocking news for TDP Working president Revanth reddy that supreme court was rejected revanth petition of impleading
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X