వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఉచ్చు బిగిస్తుందననే కేసీఆర్ అలా!.. ఆధారాలున్నాయ్, బయటపెడుతా..'

గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్‌ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న డబుల్ బెడ్ రూమ్ పథకంలో అవినీతి చోటు చేసుకుందని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గత కొద్దికాలంగా ఆరోపణలు చేస్తున్నారు.

రేవంత్ ఆరోపణలను గృహ నిర్మాణ శాఖ ఇంద్రకరణ్ తిప్పికొట్టినా.. ఆయన మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా శనివారం నాడు మీడియాతో మాట్లాడిన రేవంత్ గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్‌ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

<strong>రేవంత్‌కు ఇంద్రకరణ్ రెడ్డి సవాల్: నిరూపిస్తే.. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా!</strong>రేవంత్‌కు ఇంద్రకరణ్ రెడ్డి సవాల్: నిరూపిస్తే.. రాజకీయాల్లో నుంచి తప్పుకుంటా!

Revanth Reddy allegations on telangana govt housing scheme

గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాలకు, అవినీతికి కొమ్ముకాయొద్దని రేవంత్ అధికారులను హెచ్చరించారు. కేసీఆర్ తన మెడకు ఎక్కడ ఉచ్చు బిగుస్తుందోనన్న భయంతోనే విజిలెన్స్‌ నివేదికలను తొక్కి పెడుతున్నారని ఆరోపించారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాఖలో జరుగుతున్న అవినీతిని త్వరలోనే బయటపెడుతానని రేవంత్ చెప్పుకొచ్చారు. కాగా, గృహ నిర్మాణ శాఖలో అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్దమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇదివరకే సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
TDP Working president Revanth Reddy again made allegations on housing scheme. He said he have complete proofs which are related to that corruption
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X