వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నిరోధానికి చేస్తున్న చర్యలేవీ..? కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఆగ్రహాం

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషి పాక్షికంగా ఉందన్నారు. కరోనా నిర్ములనకు కాంగ్రెస్ పార్టీ సూచించిన ట్రేస్ టెస్ట్ ట్రీట్ విధానాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంతేకాదు పూర్తి స్థాయిలో కరోనా టెస్టులు చేయడం లేదు అని.. దేశ సగటు కన్నా తెలంగాణలో తక్కువ టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదని విమర్శించారు. కరోనా వైరస్ కోసం ప్రజలు స్వచ్ఛందంగా నిబ‌ద్ధ‌త‌తో మెలిగారని గుర్తుచేశారు. కానీ ఆదాయం కోసం సీఎం కేసీఆర్ వైన్ షాపులు ఓపెన్ చేశారని.. దీంతో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. విద్య సంస్థల ఫీజులు పెంచడానికి వీలు లేదని చెప్పిన సీఎం.. అందుకు సంబంధించిన ‌జీవో విడుదల చేసిన రెండు రోజులకే మెడికల్ కాలేజీ ఫీజులు పెంచార‌న్నారు.

 revanth reddy angry on cm kcr coronavirus cases..

ఓ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చి ఒకరు విష‌యాన్ని గోప్యంగా ఉంచారని, వైర‌స్ వ‌ల్ల చనిపోతే వారికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులకు ఆరు నెలల పాటు పదివేల చొప్పున రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ అంశంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలకు తాను లేఖ‌ రాస్తాన‌ని వివరించారు.

English summary
congress leader revanth reddy angry on cm kcr coronavirus cases issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X