హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి కీలక పదవి: 9 కమిటీలు, చైర్మన్లు వీరే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి కీలక పదవి దక్కింది. రేవంత్‌తో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తెలంగాణ పీసీసీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు తొమ్మిది కమిటీలు ఏర్పాటు చేశారు.

క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కో చైర్మన్‌గా డీకే అరుణ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, కో చైర్మన్‌గా కోమటిరెడ్డి, స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా వీ హనుమంత రావు, ఈసీ సమన్వయ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కోదండరెడ్డిలను నియమించారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులుఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

Revanth Reddy appointed as Congress working president

15 మందితో కోర్ కమిటీని, 53 మందితో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసారు. 17 మందితో ప్రచార కమిటీ, 41 మందితో ఎలక్షన్ కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీ, 20 మందితో స్ట్రాటజీ కమిటీలను నియమించారు. సురేష్ రెడ్డిని మూడు కమిటీల్లో వేశారు. ప్రచార కమిటీ కో చైర్మన్‌గా డీకే అరుణ, ప్రచార కమిటీ కన్వీనర్‌గా దాసోజు శ్రవణ్‌ను నియమించారు.

గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా ప్రజలతో మాట్లాడుతారని, వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తారని, కానీ మేం సంవత్సరం నుంచి రాఫెల్ స్కాం గురించి అడుగుతున్నా స్పందించడం లేదన్నారు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగి విసిగిపోతున్నామన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వని ప్రధాని ఉండటం దేశంలో మొదటిసారి అన్నారు. రాఫెల్ యుద్ద విమానం డీల్ చేసిన వ్యక్తే మౌనంగా ఉంటున్నారని అన్నారు.

English summary
Kodangal Former MLA Revanth Reddy appointed as Congress working president along with Ponnam Prabhakar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X