వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

revanth arrest: పార్లమెంట్ సెషన్ జరుగుతుండగా ఎంపీని అరెస్ట్ చేస్తారా: భట్టి విక్రమార్క..

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఓ ఎంపీని అరెస్ట్ చేసి.. జైలుకు తరలించడం ఏంటీ అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన భూముల అక్రమాలపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కక్షసాధింపుతోనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

నియంతృత్వ పాలన

నియంతృత్వ పాలన

తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని భట్టి మల్లు విక్రమార్క్ ఫైరయ్యారు. ఒక ఎంపీని అరెస్ట్ చేసి.. జైలుకు పంపించడం ఏంటీ అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయడం హేయనీయమని భట్టి మండిపడ్డారు. జన్వాడ ఫఆం హౌస్‌ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారని అరెస్ట్ చేయడం ఏంటీ అని ప్రశ్నించారు.

నిర్వీర్యం..

నిర్వీర్యం..

రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని మండిపడ్డారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తే.. అరెస్ట్ చేస్తారా..? ఇదేమీ రాజ్యం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై నమోదు చేసిన కేసులను భేషరతుగా విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతామని చెప్పారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

రేవంత్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో 111జీవో పరిధిలో ఉన్న కేటీఆర్ ఫాంహౌస్ ను పరిశీలించేందుకు సోమవారం మీడియాతో కలిసి వెళ్లారు. మంత్రి కేటీఆర్ బినామీ పేర్లతో ఫాంహౌస్`లో అక్రమంగా కట్టడాలు కడుతూ, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని.. ఈ కట్టడాలను వెంటనే కూల్చాలనే డిమాండ్ చేశారు. మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లి చూపించారు.

Recommended Video

Revanth Reddy Arrest Exclusive Visuals | Oneindia Telugu
రేవంత్ అరెస్ట్..

రేవంత్ అరెస్ట్..

కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భద్రతా కారణాలరీత్యా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పిన పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. తర్వాత గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఉప్పరపల్లి న్యాయస్థానంలో హాజరపర్చారు. దీంతో కోర్టు రేవంత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.

English summary
congress leader revanth reddy arrest is undemocratic bhatti vikramarka said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X