• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీశైలం ప్రమాద స్థలానికి వెళ్ళకుండా రేవంత్ రెడ్డి అరెస్ట్ .. కేసీఆర్ కు అంత భయమెందుకు రేవంత్ ప్రశ్న

|

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకున్న విషాదంలో 9మంది మరణించారు . ఈ క్రమంలో శ్రీశైలం ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించడానికి వెళ్తున్న మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలం వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా దిండి సమీపంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

  Revanth Reddy Taken Into Custody While Going To Srisailam || Oneindia Telugu
  రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఉప్పునుంతల పోలీసులు .. అరెస్ట్ పై రేవంత్ ఫైర్

  రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఉప్పునుంతల పోలీసులు .. అరెస్ట్ పై రేవంత్ ఫైర్

  శ్రీశైలం ఎడమగట్టు పవర్ స్టేషన్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనా స్థలానికి వెళుతున్న క్రమంలో ఉప్పునుంతల పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రేవంత్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించే స్వేచ్ఛ కూడా ప్రతిపక్ష నేతలకు లేదా? అంటూ ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సంఘటన వెనుక వాస్తవాలు తెలుసుకునేందుకు వెళుతుంటే కెసిఆర్ కు అంత భయమెందుకు అంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. దిండి వద్ద ఖాకీల పహారా పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి అంటూ ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

  శ్రీశైలం ప్రమాద ఘటనా స్థలానికి వెళ్తున్న రేవంత్ .. అడ్డుకున్న పోలీసులు

  శ్రీశైలం ప్రమాద ఘటనా స్థలానికి వెళ్తున్న రేవంత్ .. అడ్డుకున్న పోలీసులు

  రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ఆయన కాసేపు వాగ్వాదానికి దిగారు.దిండి వద్ద రేవంత్ రెడ్డి ని అడ్డుకున్న పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ చనిపోయిన కుటుంబాల పట్ల మాకు సానుభూతి ఉంది. వారిని పరామర్శించి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది అంటూ పేర్కొన్నారు. మమ్మల్ని ఆపటం సరికాదంటూ రేవంత్ పోలీసులకు తెలిపారు. కావాలంటే పోలీస్ వెహికిల్ లోనే వస్తాను, సీన్ ఆఫ్ అఫెన్స్ కి ఇబ్బంది అనుకుంటే ఆ పరిధి వరకు తాడు కట్టుకోండి అంటూ రేవంత్ పోలీసులతో వాదించారు. కానీ ఈ విధంగా అడ్డుకోవడం సరి కాదని మండిపడ్డారు.అయినాసరే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి శ్రీశైలం ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

   శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా ? కుట్రా అని కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్

  శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా ? కుట్రా అని కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్

  నిన్నటికి నిన్న శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా ? కుట్రా ? అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి జగన్ జల దోపిడీకి కేసీఆర్ సహకరించి విద్యుత్ ప్రాజెక్టులను చంపేసి కుట్ర జరుగుతుందని ముందే చెప్పా మని , ప్రస్తుతం జరిగిన పరిణామం ఆ అనుమానాలకు తావిస్తోంది అంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు కుట్రను ప్రమాదం పేరుతో కప్పి పెట్టే ప్రయత్నం ఉందేమో అనిపిస్తోంది అంటూ, ఈ ఘటనపై సిబిఐ విచారణ జరపాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

   మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రేవంత్ డిమాండ్

  మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రేవంత్ డిమాండ్

  శ్రీశైలం విద్యుత్ కేంద్రం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన రేవంత్ రెడ్డి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ఇంటికొక ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించాలని ఆయన చేసిన యత్నాలకు తెలంగాణ పోలీసులు బ్రేక్ వేశారు. దీంతో రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రజాప్రతినిధులుగా సంఘటనపై పరిశీలించి బాధితులను పరామర్శించడం తమ బాధ్యతని , కానీ దానిని కూడా అడ్డుకునే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Nine people have been died in a tragic fire that broke out at the Srisailam Hydroelectric Power Station due to a short circuit. Police arrested Malkajgiri MP Revanth Reddy and former MP Mallu Ravi while they were on their way to visit the Srisailam accident scene. He was prevented from going to Srisailam. PCC Working President, MP Revanth Reddy was arrested by the police near Kattamayasamma temple near Dindi in Nagar Kurnool district.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X