వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ .. హైకమాండ్ నిర్ణయం ఇదే అయితే కాంగ్రెస్ లో రచ్చేనా ?

|
Google Oneindia TeluguNews

టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని అధికారికంగా ప్రకటించేందుకు హైకమాండ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా టీపీసీసీ చీఫ్ ఎన్నిక విషయంలో మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ గా తెలంగాణలో అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు రేవంత్ రెడ్డి అన్న భావనకు వచ్చినట్లుగా సమాచారం.

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ..స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదు : సోషల్ మీడియాలో పోస్ట్రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ..స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదు : సోషల్ మీడియాలో పోస్ట్

రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ .. హైకమాండ్ ఆలోచన

రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ .. హైకమాండ్ ఆలోచన

ఇక ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటు, పీసీసీ చీఫ్ పోటీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కూడా హైకమాండ్ మంతనాలు జరిపి,అన్ని సమీకరణాలు పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎవరికి అవకాశం ఇచ్చిన కలిసి పని చేస్తామని వారి వద్ద నుండి హైకమాండ్ మాట తీసుకున్నట్లుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడానికి కావలసిన గట్స్, అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి కావలసిన సత్తా, అందరినీ కలుపుకొని పని చేయగలిగిన సామర్థ్యం రేవంత్ కు ఉన్నాయని హైకమాండ్ భావిస్తుంది.

 రేవంత్ ను ఢిల్లీ పిలిచే అవకాశం .. సీనియర్స్ మాట నెగ్గనట్టేనా !!

రేవంత్ ను ఢిల్లీ పిలిచే అవకాశం .. సీనియర్స్ మాట నెగ్గనట్టేనా !!

అన్ని రకాలుగా ప్లస్ లూ, మైనస్ లను పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ గా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇక ఇప్పటికీ రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . ఇక సీనియర్లు హైకమాండ్ కు చెప్తున్న రీజన్స్ సహేతుకమైన రీజన్స్ గా కాంగ్రెస్ అధిష్టానం భావించటం లేదు .

 మొదటి నుండి రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు

మొదటి నుండి రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు

ఇక రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించడాన్ని చాలామంది సీనియర్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.ఆయనకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు జగ్గారెడ్డి లాంటి నేతలు ఇప్పటికే చేశారు. ఇక విహెచ్ వంటి నేతలు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న వారు, పార్టీ కోసం గట్టిగా పని చేయగలిగిన వారు చాలామంది ఉన్నారని బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఇక దీంతో ఆయన పై వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపథ్యంలో హైకమాండ్ కాస్త గ్యాప్ తీసుకుంది.

తెలంగాణాలో తాజా పరిస్థితుల నేపధ్యంలోనే నిర్ణయం

తెలంగాణాలో తాజా పరిస్థితుల నేపధ్యంలోనే నిర్ణయం

రేవంత్‌కు తప్ప ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తామనే సంకేతాన్ని సైతం హైకమాండ్‌కు పంపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముందు నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న లీడర్ కాకపోవడం ఒక్కటే మైనస్ మినహాయించి మిగతా అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొంటాడు అని భావిస్తుంది.

Recommended Video

YS Jagan ఫోటో పెట్టుకుని మళ్లీ గెలవండి రా చూస్తాను - Raghu Rama Krishnam Raju
రేవంత్ ను ప్రకటిస్తే టీపీసీసీలో రచ్చేనా ?

రేవంత్ ను ప్రకటిస్తే టీపీసీసీలో రచ్చేనా ?

ఇక కర్ణాటకలో సిద్ధరామయ్య కూడా మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నేత కాదు. అయినా కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రిగా పదవిని పొందారు. ఎవరైనా సరే వారికి సత్తా ఉండడమే ముఖ్యమని హైకమాండ్ భావిస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా రేవంత్ మాత్రం తెలంగాణ ప్రభుత్వం పై తన పోరాట పంథాను మార్చుకోలేదు. అలాగే కాంగ్రెస్ పై విధేయత ప్రదర్శిస్తూనే రేవంత్ రెడ్డి హైకమాండ్ మెప్పు పొందాడు అని సమాచారం. ఇతర నేతలు మాత్రం రేవంత్ ను టీపీసీసీ చీఫ్ గా ప్రకటిస్తే కచ్చితంగా వ్యతిరేకిస్తామని తేల్చి చెబుతున్నారు. ఏది ఏమైనా హైకమాండ్ అధికారిక ప్రకటన తర్వాతే తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తేలనుంది.

English summary
The coronavirus crisis and the need to maintain social distancing has forced people to postpone their wedding ceremonies, but Indian archers Atanu Das and Deepika Kumari are going ahead with their plans to tie the knot. But the archery stars will need to follow government guidelines which limits public gatherings to a maximum of 50 people. And it has become an issue with their relatives and friends, with many of them asking for the wedding to be postponed again."We are getting married to get the marriage out of the way as we have been engaged for almost two years now. Samajik vivah karna chahte hai bas,” Atanu told The Tribune.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X