వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ఇవ్వండి.. హెల్త్ ఎమర్జెన్సీ విధించండి: రేవంత్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయం కూల్చివేతపై మంగళవారం రేవంత్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గవర్నర్ పిలిచినా రాకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ను గాలికొదిలేశారు..

హైదరాబాద్‌ను గాలికొదిలేశారు..


వెంటనే సీఎస్ తోపాటు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని విధుల్లోంచి తొలగించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపైనా రేవంత్ మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. గవర్నర్ తమ హక్కులను ఉపయోగించుకోవాలని, గవర్నర్‌కి ప్రభుత్వ అధికారులు
స్పందించకపోతే కేంద్రమంత్రి కలగజేసుకోవాలని రేవంత్ అన్నారు. సీఎం కేసీఆర్
హైదరాబాద్ ప్రజలను గాలికొదిలేసి ఫాంహౌస్‌కి వెళ్లిపోయారని మండిపడ్డారు.

కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయండి..

కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయండి..

పీవీ శతజయంతి రోజు మాయమైన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కూడా కనిపించలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్ అఖిలపక్షాన్ని పిలవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ భవనాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయని, సెక్రటేరియట్ కూల్చివేసే ముందు గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుందా? అని రేవంత్ ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి..

హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి..

మూడు రోజుల్లో కేబినెట్ భేటీ ఉంటుందని, హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అనే వార్తలతో ప్రజలంతా హైదరాబాద్ ఖాళీ చేస్తున్నారని అన్నారు. అంతేగాక, సెక్షన్-8ని ఉపయోగించి హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ వైద్యాన్ని ఒకే వేదిక మీదకు తేవాలన్నారు.

కేసీఆర్.. ఆ లెక్కలు చెప్పాలి..

కేసీఆర్.. ఆ లెక్కలు చెప్పాలి..

దాతలు ఇచ్చిన నిధులను ప్రభుత్వం ఎలా ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యవేక్షణ లేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని, గవర్నర్ తక్షణమే సదరు అధికారులకు నోటీసులు ఇవ్వాలని కోరారు. ఒక్కో కరోనా రోగిపై రూ. 3.50లక్షల ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఎంత మంది కరోనా పేషెంట్లకు ఈ మొత్తం ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలో 25వేలకుపైగా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

English summary
Congress MP Revanth Reddy asks for telangana cm kcr's health bulletin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X