వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై తీర్పు రేపటికి వాయిదా: బెయిల్ పై డైలమాలో కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని రేవంత్‌ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన వాదనలు విన్న కోర్టు నేడు బెయిల్ ఇవ్వలేదు . కేసులో తీర్పును రేపటికి వాయిదా వెయ్యటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

కూకట్ పాలలో కోర్టులో రేవంత్ బెయిల్ పిటీషన్ పై వాదనలు

కూకట్ పాలలో కోర్టులో రేవంత్ బెయిల్ పిటీషన్ పై వాదనలు

కేటీఆర్ ఫాం హౌస్ వద్ద రూల్స్ కు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ చేసినందుకు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. నేడు కూకట్ పల్లి కోర్టులో జరిగిన వాదనల్లో జడ్జి ఈ పిటీషన్ విషయంలో తీర్పు రేపటికి వాయిదా వేశారు. ఇక రేవంత్ రెడ్డి పాత కేసుల్లో రేవంత్‌పై పీటీ వారెంట్‌ను చూపి ఆయనను విచారణకు అప్పగించమని అడిగారు పోలీసుల తరపు లాయర్ .

పీటీ వారెంట్లు చూపిస్తూ బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్న ప్రభుత్వం

పీటీ వారెంట్లు చూపిస్తూ బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్న ప్రభుత్వం

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన పాత కేసుల్లో పీటీ వారెంట్లు చూపిస్తూ రేవంత్ కు బెయిల్ రాకుండా ఆయన మీద కేసులు మోపుతున్న తెలంగాణా సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఇక ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారని రేవంత్ తరపు న్యాయవాది శ్రీనివాసరావు తెలిపారు. అదే సాకుతో పీటీ వారెంట్‌ ఇస్తున్నారని, బెయిల్‌ ఇవ్వాలని రేవంత్‌ తరపు లాయర్‌ శ్రీనివాసరావు కోరారు. కానీ ప్రభుత్వం రేవంత్ పై వరుస కేసులు బనాయించటం తో రేపు కూడా రేవంత్ కు బెయిల్ వస్తుందా అన్నది అనుమానమే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Recommended Video

Telangana Budget 2020 : Women Not Satisfied With Budget | Oneindia Telugu
తీవ్ర అసహనంలో కాంగ్రెస్ .. బెయిల్ వస్తుందా?

తీవ్ర అసహనంలో కాంగ్రెస్ .. బెయిల్ వస్తుందా?

ఇక న్యాయ నిపుణులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేవంత్ ను కావాలని కేసీఆర్ సర్కార్ ఇబ్బంది పెడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు బెయిల్ ఇస్తారని భావించిన కాంగ్రెస్ శ్రేణులు బెయిల్ రాకపోవటంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. కూకట్‌పల్లి కోర్టు తీర్పు రేపటికి రేవంత్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా వేసింది. రేపైనా రేవంత్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి .

English summary
In the arguments in Kukat Palli court today, the judge adjourned the matter to tomorrow. In the old cases, police showed PT warrant on Revanth and asked him to be prosecuted. The Telangana government is attempting to sue Revanth without bailing him out in the old cases that the government has spoken against.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X