వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది కల్వకుంట్ల అజ్ఞానమా... ధనదాహమా? సాక్ష్యాలతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ప్రమాదం జరగడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ నిర్వాకంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరిగాయి. రంగారెడ్డి ఫస్ట్ పంపు హౌస్ తో పాటుగా అప్రోచ్ ఛానల్ కోసం భూగర్భంలో చేపట్టిన పేలుళ్ళతోనే ఈ ప్రమాదం జరిగిందని కల్వకుర్తి పంప్ హౌస్ నీట మిగిలిపోయిందని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరిగాయి . పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మిస్తే కల్వకుర్తి పంప్ హౌస్ దెబ్బతింటుందని సీనియర్ ఇంజనీర్లు హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది విశ్వనగరమా... మురికి కూపమా .. కేటీఆర్‌ ఎక్కడ..? రేవంత్ రెడ్డి ఫైర్ఇది విశ్వనగరమా... మురికి కూపమా .. కేటీఆర్‌ ఎక్కడ..? రేవంత్ రెడ్డి ఫైర్

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదం గురించి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు . ఈ మేరకు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ కు జ్ఞానం లేదంటూ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి తనకంటే తెలిసినోడు ఎవడని ప్రశ్నించే కేసీఆర్ కు కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ లో ఒక ఇంజనీరుకు ఉన్నంత జ్ఞానం కూడా లేదే అంటూ ఎద్దేవా చేశారు.

లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలపై హెచ్చరికలతో ఎస్ఈలు రాసిన లేఖలు .. బయటపెట్టిన రేవంత్

లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలపై హెచ్చరికలతో ఎస్ఈలు రాసిన లేఖలు .. బయటపెట్టిన రేవంత్

సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సాక్ష్యం ఇదిగో అంటూ లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలపై హెచ్చరికలు జారీ చేస్తూ ఎస్ఈలు రాసిన లేఖలను ఆయన బయట పెట్టారు .

ఇది కల్వకుంట్ల అజ్ఞానమా ? దన దాహమా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వాస్తవాలు ఇవిగో అంటూ ప్రభుత్వానికి ఎస్ ఈ లు రాసిన లేఖలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ప్రమాదం చోటు చేసుకోవడంతో పంప్ హౌస్ లో 45 అడుగులకు పైగా నీరు చేరటం రాజకీయంగానూ దుమారం రేగింది.

Recommended Video

Dubbaka Bypoll: MP Revanth Reddy Campaign దుబ్బాక కోసం కాదు తెలంగాణ కోసం ఓటెయ్యండి!! || Oneindia
 కల్వకుర్తి పంప్ హౌస్ ప్రమాదం నాటి నుండి కాంగ్రెస్ నేతల పోరాటం

కల్వకుర్తి పంప్ హౌస్ ప్రమాదం నాటి నుండి కాంగ్రెస్ నేతల పోరాటం

కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌస్ పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన తర్వాత పంప్ హౌస్ పరిశీలనకు వెళ్లిన రేవంత్ రెడ్డి, మల్లురవి, సంపత్ కుమార్ తదితర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో రేవంత్ రెడ్డి కాలికి గాయమైంది. అప్పటి నుండి కేసీఆర్ నిరంకుశ పాలనపై నిప్పులు చెరుగుతున్న రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి తెలంగాణ ప్రభుత్వం అక్రమాలను చేస్తోందని మండిపడుతున్నారు.

English summary
Congress party firebrand Malkajgiri MP Revanth Reddy has recently once again lashed out at CM KCR over the Kalvakurthi lift irrigation accident. Revanth questioned the negligence of CM KCR. This was tweeted by TPCC Working President Revanth Reddy and said that KCR had no knowledge. KCRdoes not even have the knowledge of an engineer in the Kalvakurthi lift scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X