వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూపల్లికి షాక్: నాగసానిపల్లిలో అడ్డుకొన్న రేవంత్ వర్గీయులు, కొడంగల్‌లో హరీష్ టీమ్ సర్వే

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోస్గి మండలం నాగసానిపల్లిలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అడ్డుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

జూపల్లి కృష్ణారావును అడ్డుకొన్న రేవంత్‌రెడ్డి సోదరుడు | Oneindia Telugu

కొడంగల్: కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోస్గి మండలం నాగసానిపల్లిలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అడ్డుకొన్నారు. సర్పంచ్ లేకుండా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని వాగ్వావాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

రేవంత్ ప్లాన్: స్పీడ్ తగ్గించి, సీనియర్లతో భేటీలు, వ్యూహత్మక మౌనంరేవంత్ ప్లాన్: స్పీడ్ తగ్గించి, సీనియర్లతో భేటీలు, వ్యూహత్మక మౌనం

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ నాయకత్వం వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. రేవంత్ రెడ్డితో పాటు టిడిపిలో ఇంతకాలం పాటు కొనసాగిన కీలక నేతలను టిఆర్ఎస్ తమ వైపుకు తిప్పుకొంది.

కొడంగల్ బైపోల్‌కు టిఆర్ఎస్ ప్లాన్, రేవంత్‌పై కెసిఆర్ ప్లాన్ ఇదేకొడంగల్ బైపోల్‌కు టిఆర్ఎస్ ప్లాన్, రేవంత్‌పై కెసిఆర్ ప్లాన్ ఇదే

మరో వైపు కాంగ్రెస పార్టీకి చెందిన నేతలను కూడ టిఆర్ఎస్‌లోకి ఆకర్షించేందుకు టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఉప ఎన్నికల్లోనైనా, 2019 ఎన్నికల్లోనైనా రాజకీయంగా కొడంగల్‌లో రేవంత్‌ను దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.ఇందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది.

రంగంలోకి ఆ ఇధ్దరు మంత్రులు: రేవంత్‌కు చెక్ పెట్టే ప్లాన్ ఇదే!రంగంలోకి ఆ ఇధ్దరు మంత్రులు: రేవంత్‌కు చెక్ పెట్టే ప్లాన్ ఇదే!

రేవంత్‌కు షాక్: టిడిపిలోనే అనురాధ, ఆ కుటుంబంపైనే పార్టీల దృష్టిరేవంత్‌కు షాక్: టిడిపిలోనే అనురాధ, ఆ కుటుంబంపైనే పార్టీల దృష్టి

మంత్రి జూపల్లిని అడ్డుకొన్న రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి

మంత్రి జూపల్లిని అడ్డుకొన్న రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి

కోస్గి మండలం నాగసానిపల్లిలో మంత్రి జూపల్లి కృష్ణారావును రేవంత్‌రెడ్డి సోదరుడు అడ్డుకొన్నారు. నాగసానిపల్లిలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అడ్డుకున్నారు.కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. తిరుపతి రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంత్రిని ప్రశ్నించారు.

టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

స్థానిక సర్పంచ్ కూడ లేకుండా బీటీ రోడ్డుకు ఎలా శంకుస్థాపన చేస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావుతో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఒకానొక దశలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పారు.దీంతో మంత్రి బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు.

కొడంగల్‌పై టిఆర్ఎస్ నజర్

కొడంగల్‌పై టిఆర్ఎస్ నజర్

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది. రేవంత్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడ తన రాజీనామా చేశారు. కానీ, ఆ రాజీనామా లేఖ ఇంకా స్పీకర్‌ కార్యాలయానికి చేరలేదు. ఈ తరుణంలో టిఆర్ఎస్‌ నాయకత్వం రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తోంది. మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో టిఆర్ఎస్ నాయకులు కొడంగల్‌లో టిఆర్ఎస్ గెలుపు కోసం ప్లాన్ చేస్తున్నారు.

రంగంలోకి హరీష్‌రావు టీమ్

రంగంలోకి హరీష్‌రావు టీమ్

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావు టీమ్ రంగంలోకి దిగింది. ప్రతి గ్రామంలో ఈ టీమ్ సభ్యులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలేమిటీ, ఏ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆయా గ్రామాల్లో ఏ పార్టీ బలమెంత, గ్రామాల్లో ఎవరి ఆధిపత్యం సాగుతోంది. ఎవరు చెబితే ఓటర్లు ఎక్కువగా మొగ్గుచూపుతారు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలేమిటీ, ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలేమిటనే విషయాలపై హరీష్ టీమ్ నివేదికను తయారు చేస్తోంది.ఈ నివేదిక ఆధారంగా టిఆర్ఎస్ నాయకత్వం భవిష్యత్‌ ప్లాన్ చేస్తోంది.ః

English summary
Revanth Reddy brother Tirupati Reddy obstructed minister Jupally Krishna Rao in Nagasanipalle village on Monday. minister Jupally Krishna Rao laid foundation stone for BT road after police involvement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X