వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైరా రేవంత్ రెడ్డి.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి సై సై.. వేడెక్కనున్న రాజకీయం..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక వేడెక్కబోతోంది. ఎన్నికల ప్రచారానికి గడువు సమిపిస్తండడంతో వివిధ పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగబోతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా ఆ పార్టీల నుండి కీలక నేతలు ప్రచారంలో పాల్గొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అదికార గులాబీ పార్టీ నుండి మంత్రి కేటీఆర్ ఇప్పటికే బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే మకాం వేసి ప్రచారాన్ని ఉదృతం చేసారు. తెలుగుదేశం పార్టీ కూడా గ్రామ గ్రామంలో బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ఉప పోరులో దూసుకెళ్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారం పైనే ఉత్కంఠ నెలకొంది. ఈనెల 18,19 తారీఖుల్లో రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ లో ప్రచారం నిర్వహించబోతున్నారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక సమీకరణాలు పెద్ద ఎత్తున మారబోతున్నట్టు చర్చ జరుగుతోంది.

ఒక్క అల్లుడికే భయపడ్డావు! అలా చేస్తే సమ్మె ఉండేది కాదు కదా?: కేసీఆర్‌కు రేవంత్ సూటి ప్రశ్నలుఒక్క అల్లుడికే భయపడ్డావు! అలా చేస్తే సమ్మె ఉండేది కాదు కదా?: కేసీఆర్‌కు రేవంత్ సూటి ప్రశ్నలు

 హోరెత్తనున్న హుజూర్ నగర్ ఉప పోరు.. ప్రచార రంగంలోకి రేవంత్ రెడ్డి..

హోరెత్తనున్న హుజూర్ నగర్ ఉప పోరు.. ప్రచార రంగంలోకి రేవంత్ రెడ్డి..

హుజూర్ నగర్ ఉప ఎన్నిక రసవత్తర ఘట్టానికి చేరుకోబోతోంది. ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారాన్ని ఉదృతం చేసేందుకు ముఖ్య నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులను ప్రచారంలోకి దించేందకు పావులు కదుపుతోంది. అంతే కాకుండా ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. హరీష్ రావు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటే ప్రభావ వంతంగా ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వచ్చే నేతలను బట్టి హరీష్ ప్రచార డేట్లు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 కాంగ్రెస్ గెలుపు పై ఆశలు.. రేవంత్ రెడ్డి ప్రచారంతో మారనున్న సీమీకరణాలు..

కాంగ్రెస్ గెలుపు పై ఆశలు.. రేవంత్ రెడ్డి ప్రచారంతో మారనున్న సీమీకరణాలు..

కాగా కాంగ్రెస్ పార్టీ తరుపు నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఇప్పుడు ఒంటిపోరు చేస్తున్నట్టు తెలుస్తోంది. భార్య పద్మావతిని గెలిపించాల్సిందిగా ఆయర ఊరూ వాడా తిరుగుతున్నారు. రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్ లు నిర్వహిస్తున్నారు. ఐనప్పటికి ఇంకేదో కావాలని హుజూర్ నగర్ ప్రజలు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. అది గ్రహించిన కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డిని ప్రచారానికి పంపిచబోతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డ ప్రచారాన్ని బట్టి అదికార గులాబీ పార్టీ ఎవరెవరిని రంగంలోకి దింపాలో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 చివరి రెండు రోజలు రేవంత్ మెరుపు ప్రచారం.. కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపు ధీమా..

చివరి రెండు రోజలు రేవంత్ మెరుపు ప్రచారం.. కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపు ధీమా..

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్ బట్టి అధికార పార్టీ ఎవరిని రంగంలోకి దించాలోనని ప్రణాళికలు రచిస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రభావం హుజూర్ నగర్ లో ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే అంశాన్ని గతంలో స్వయంగా కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతే తన సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి తన ప్రచారానికి వస్తే తన గెలుపు సేనాయాసమవుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. పద్మావతి కోరుకున్నట్టు రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ప్రచారానికి సై అంటున్నారు. అందుకోసం రెండు రోజులు ఏక దాటిగా నియోజక వర్గాన్ని చుట్టేయనున్నారు రేవంత్ రెడ్డి.

 రేవంత్ రెడ్డి ప్రచారంపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ.. ప్రచారానికి మంత్రి హరీష్ రావు..

రేవంత్ రెడ్డి ప్రచారంపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ.. ప్రచారానికి మంత్రి హరీష్ రావు..

ఈనెల 18, 19 తారీఖుల్లో అంటే ప్రచారం చివరి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి మెరులాంటి ప్రాచార ముగింపు ఇవ్వబోతున్నారు రేవంత్ రెడ్డి. చివరి రెండు రోజుల్లో ఏడు మండలాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. నియోజక వర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రచారానికి రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రచారానికి ధీటుగా అధికార పార్టీ తరుపున హరీష్ రావు తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ ప్రచారం పలు రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

English summary
Congress Party working president with Revanth Reddy's campaign has been thrilling. In the 18th and 19th of this month, Revanth Reddy is going to campaign in Huzur Nagar. This is a debate where the by-election equations are going to change at a large scale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X