వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ ప్రచారం: భయపడుతున్నారని కెటిఆర్

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: జిల్లా పాలేరు ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం మరో ఆసక్తికర సన్నివేశం కనిపించనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డి విజయం కోసం తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న రేవంత్ రెడ్డి.. నేరుగా పాలేరుకు వెళ్లనున్నారు. బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు.. తెలంగాణలో అధికార పార్టీ టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపాయి.

ఈ క్రమంలో సుచరితారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన టీటీడీపీ ఈ ఉప ఎన్నికలో అభ్యర్థినే బరిలోకి దింపలేదు. తాజాగా టీ టీడీపీలో ముఖ్యనేతగా ఉన్న రేవంత్ రెడ్డి బుధవారం నుంచి సుచరితారెడ్డి తరఫున ప్రచారంలో పాల్లొంటుండటంపై ఆసక్తి నెలకొంది.

 Revanth reddy campaigns for congress in paleru by poll

కాంగ్రెస్ ముందే ఓడిపోయింది: కెటిఆర్

పాలేరు ఉప ఎన్నిక పోలింగ్‌ జరగక ముందే కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని అంగీకరించినట్టుగా ఉందని రాష్ట్ర మంత్రి, పాలేరు ఎన్నికల ఇంఛార్జ్ కె తారకరామారావు అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఓటమి భయంతోనే సానుభూతి నాటకాలు ఆడుతున్నారని, రకరకాల ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

తమ గెలుపుపై విశ్వాసం ఉందని, ప్రజలు టీఆర్‌ఎ్‌సనే గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. పాలేరు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు.

తాము అడిగిన దానికి కాంగ్రెస్‌ వారు సమాధానం చెప్పలేదని, వారు అడిగిన దానికల్లా తాముసమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ గెలవకపోతే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, కాంగ్రెస్ వారికి ఆ నమ్మ కం లేదన్నారు. కాంగ్రెస్‌ వారికి నైతిక విలువలు, నైతిక బాధ్యతలు అన్న పదాలకు అర్ధం తెలుసా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీకి నైతిక విలువలు ఉంటే వి జ్ఞతతో మాట్లాడాలని, ఓడిపోతామనుకుంటే వ్యక్తిగ త విమర్శలు మానేయాలన్నారు. అంతేగానీ కేసీఆర్‌ మాట్లాడితేనే స్పందిస్తాననడం సరైందికాదన్నారు. పాలేరులో 11 సార్లు అ క్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, వారు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సూచించారు. అంతేగానీ కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు గెలిపిస్తారనుకోవడం అవివేకమన్నారు.

'మొన్న నారాయణఖేడ్‌లోనూ, గతంలో ఏ మాధవరెడ్డి పోతేనూ కాంగ్రెస్‌వారు పోటీ చేయలేదా? ఇంద్రారెడ్డి చనిపోతే, రజబ్‌ అలీ చనిపోతే పోటీ చేయలేదా? అప్పడు మానవత్వం, విలువలు ఎటుపోయాయి? ప్రజలకు అన్ని విషయాలూ తెలుసు. అధికార దుర్వినియోగం ఎక్కడ చేశామో చెప్పాలి. కుంటిసాకులు చెప్పొద్దు' అని మంత్రి కెటిఆర్ అన్నారు.

English summary
TTDP leader Revanth reddy will campaign for congress in paleru by poll on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X