• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష.!ఆ ఫలితాలు తెలంగాణ మీద ప్రభావం చూపితే కథ మొదటికి వచ్చినట్టే.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెత ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు అతికినట్టు సరిపోయింది. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఊపిరిలూది, పట్టాలెక్కించి పరుగులు పెట్టించే క్రమంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు శరాఘాతంలా పరిణమించాయి. రేవంత్ రెడ్డి పార్టీని ఎంత ముందుకు లాగుతున్నాడో పరిస్థితులు అంత వెనక్కు నెడుతున్నాయి. ఒక అడుగు ముందుకు పడితే, పది అడుగులు వెనక్కు పడుతున్న చందంగా తయారయ్యంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ మీద పడకుండా రేవంత్ రెడ్డి తక్షణం జాగ్రత్త పడాల్సిన అవశ్యకత తలెత్తింది.

 అనుకోని కుదుపులు.. రేవంత్ అధిగమిస్తారా.?

అనుకోని కుదుపులు.. రేవంత్ అధిగమిస్తారా.?

పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడేసినట్టు తయారయ్యింది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. ప్రధాన ప్రతిపక్ష హోదా నుండి క్రమం క్రమంగా బలహీనపడి, సరైన నాయకత్వం లేక మిగిలిన నాయకులు, కార్యకర్తలు కూడా నిరాశా నిస్పృహలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పీసిసి అద్యక్షలుగా బాద్యతలు చేపట్టిన మరుక్షణం నుండి పార్ఠీలో నూతన ఉత్సాహం కనిపించింది. వెలవెల బోయిన గాందీ భవన్ కు పార్టీ శ్రేణులు, కార్యకర్తల తాకిడితో కొత్త కళ మొదలైంది. 33జిల్లాల నుండి పార్టీ నేతలు గాంధీ భవన్ కు చేరుకుని తమ సమస్యలను, అవసరాలను పార్టీ నాయకులకు వినిపించుకునేందుకు క్యూ కట్టడం మొదలుపెట్టారు.

 తెలంగాణ కాంగ్రెస్ లో ఊపు, ఉత్సాహం నింపిన రేవంత్.. ఖంగు తినిపిస్తున్న పరిణామాలు

తెలంగాణ కాంగ్రెస్ లో ఊపు, ఉత్సాహం నింపిన రేవంత్.. ఖంగు తినిపిస్తున్న పరిణామాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు దొరికాడు అనే భరోసా పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకుంటున్న తరుణంలో ఊహించని కొన్ని అవరోధాలు రేవంత్ రెడ్డికి సవాల్ గా పరిణమించాయి. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు డిజిటల్ మెంబర్ షిప్ డ్రైవ్ ను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. అంతే కాకుండా రాజకీయంగా దృఢంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకు, కార్యకర్తల్లో భరోసా నింపేందుకు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా, రచ్చ బండ, కల్లాల్లో కాంగ్రెస్, మన వూరు మన పోరు వంటి ప్రజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అధికార గులాబీ పార్టీకి గట్టి ధీటైన సమాధానం ఇస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.

 క్షేత్ర స్థాయిలో బలోపేతం..రేవంత్ అలుపెరగని శ్రమ

క్షేత్ర స్థాయిలో బలోపేతం..రేవంత్ అలుపెరగని శ్రమ

అంతే కాకుండా నిరుద్యోగ జంగ్ పేరుతో విద్యార్థిలోకానికి, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చూపే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ విభాగాలతో కార్యచరణ రూపొందించి ప్రభుత్వం పై పోరాటానికి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నింపిన ఉత్సాహంతో, భరోసాతో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు క్షేత్ర స్దాయిలో తమ సత్తాను చాటారు. రేవంత్ నేతృత్వంలో ఏదో ఒక కార్యక్రమంతో అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని సంఘటనలు అనుకోని బ్రేకులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. టీపిసిసి మీద ప్రభావం పడకుండా రేవంత్ ప్రయత్నాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. టీపిసిసి మీద ప్రభావం పడకుండా రేవంత్ ప్రయత్నాలు

హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి నమోదైన ఓట్లు ఆ పార్టీని కలవరానికి గురి చేసాయి. రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ పురోగమిస్తుందా.? తిరోగమిస్తుందా అనే సందేహాలను కొద్ది మంది నేతలు వ్యక్తం చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పట్ల కూడా పార్టీలో అసహనం వ్యక్తం అయ్యింది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం కూడా పార్టీలో దుమారం రేగుతోంది. పార్టీ జాతీయ నాయకత్వం పటిష్టంగా లేనప్పుడు రాష్ట్రాల్లో ఎలా మనుగడ సాధిస్తుందనే ప్రశ్నలు పార్టీ శ్రేణులనుండి ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్చ మరింత జోరందుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్థానానికి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
There is an urgent need for Revant Reddy to be careful not to let the impact of the results of the five state elections fall on the Telangana Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X