హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఫిడవిట్లో రేవంత్ రెడ్డి ఆస్తులు, కేసుల వివరాలు ఇవీ: భార్య పేరిటే ఎక్కువ ఆస్తి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : రేవంత్ రెడ్డి ఆస్తులు,కేసుల వివరాలు | Oneindia Telugu

కొడంగల్/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ తన ఆస్తులను రూ.3.76 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల కంటే భారీ మెజార్టీతో గెలుస్తానని చెబుతున్నారు. చంద్రబాబుకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, ఓటుకు నోటు వంటి అంశాలతో రేవంత్‌కు ప్రత్యేక ఇమేజ్ ఉంది.

<strong>చంద్రబాబు చాలా తెలివైనవారు: కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌కు బొత్స గట్టి కౌంటర్</strong>చంద్రబాబు చాలా తెలివైనవారు: కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌కు బొత్స గట్టి కౌంటర్

 రేవంత్ రెడ్డి ఆస్తులు

రేవంత్ రెడ్డి ఆస్తులు

ఇందులో రూ.1,74,97,421 కోట్లు స్థిర ఆస్తులు, రూ.2,02,69,000 చర ఆస్తులు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ ఆస్తుల విలువ రూ.7,89,69,650 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే రేవంత్ రెడ్డి సతీమణి పేరిట రూ.9.44,64,000 కోట్ల (మార్కెట్ విలువ) ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

భార్య పేరిట ఆస్తులు

భార్య పేరిట ఆస్తులు

తన భార్య పేరు మీద ఉన్న చరాస్తుల విలువను రూ.2,27,79,935గా, స్థిరాస్తుల విలువను 2,36,40,000 రూపాయలుగా అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ సతీమణి గీత పేరిట రూ.9,44,64,000 విలువగల ఆస్తులు ఉన్నాయి. గత 2014 ఎన్నికలలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డిపై 36 కేసులు

రేవంత్ రెడ్డిపై 36 కేసులు

తన పైన 36 కేసులు ఉన్నట్లు రేవంత్ రెడ్డి తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అందులో ఒకటి ఓటుకు నోటు కేసు కూడా ఉంది. 2014లో టీడీపీ 15 సీట్లలో గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయినట్లు రేవంత్ పైన ఓటుకు నోటు కేసు ఉంది. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో ఓ కుదుపు కుదిపింది. కేసీఆర్ పైన ఆరోపణలు చేసిన కేసు కూడా ఉంది. 2014 వరకు రేవంత్ పైన ఒక్క కేసు లేకపోగా, ఇప్పుడు 36 కేసులు ఉన్నాయి.

కేసీఆర్ ఆస్తులు

కేసీఆర్ ఆస్తులు

రెండు రోజుల క్రితం గజ్వెల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసారు. ఈ నామినేషన్లో కేసీఆర్ తన ఆస్తులు, కేసుల వివరాలను ప్రకటించారు. ఆస్తి విలువ రూ.22,60,77,946గా ఉంది. ఇందులో స్థిరాస్తి రూ.12.20 కోట్లు. చరాస్తులు రూ.10,40,77,946. నగదు రూపంలో రూ.2.40 లక్షలున్నట్లు కేసీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ బుధవారం నాడు మధ్యాహ్నం 2.34 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు.

English summary
Congress working president Revanth Reddy declared Rs 3.76 crore assets in election affidavit as a part of the nomination. Around Rs 1,74,97,421 were said to be immovable assets and Rs 2,0269,000 were movable assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X