హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డికి భారీ పరాభవం: 3 పార్టీల నుంచి ఓడిన కీలక, సీనియర్ నేతలు వీరే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Election Results 2018 Analysis : టీఆర్ఎస్ కీలక నేతల ఓటమి కి కారణం !

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది కీలక నేతలు ఓడిపోయారు. మహామహులు అనుకున్న నేతలు కూడా మట్టికరిచారు. టీఆర్ఎస్ దాదాపు 88 సీట్లలో, మహాకూటమి 21 స్థానాల్లో, మజ్లిస్ ఆరు స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచే పరిస్థితులు ఉన్నాయి.

నలుగురు మంత్రుల ఓటమి

నలుగురు మంత్రుల ఓటమి

బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి సభాపతి మధుసూదనా చారి, పట్నం మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా రావులు ఓడిపోయారు. అజ్మీరా చందూలాల్ కూడా ఓటమి బాటలో ఉన్నారు.

 రేవంత్ రెడ్డికి ఘోర పరాభవం

రేవంత్ రెడ్డికి ఘోర పరాభవం

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓడిపోయారు. ఇక్కడ తెరాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పదివేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు వారు కూడా ఓడిపోయారు. కొడంగల్ నియోజకవర్గంపై రేవంత్, కేటీఆర్ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇది రేవంత్ రెడ్డికి ఘోర పరాభవం.

ఓడిపోయిన కాంగ్రెస్ కీలక నేతలు

ఓడిపోయిన కాంగ్రెస్ కీలక నేతలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్, కీలక నేతలు రేవంత్ రెడ్డి (కొడంగల్), జానారెడ్డి (నాగార్జున సాగర్), డీకే అరుణ (గద్వాల), సంపత్ కుమార్ (అలంపూర్), కోమటిరెడ్డి వెంకట రెడ్డి (నల్గొండ, జీవన్ రెడ్డి (జగిత్యాల), దామోదర రాజనర్సింహ (ఆందోల్), సునితా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), సుదర్శన్ రెడ్డి (బోధన్), ఉత్తమ్ పద్మావతి రెడ్డి (కోదాడ), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కొండా సురేఖ (పరకాల), బలరాం నాయక్ (మహబూబాబాద్), సర్వే సత్యనారాయణ (కంటోన్మెంట్), ముఖేష్ గౌడ్ (గోషామహల్), చిన్నారెడ్డి (వనపర్తి)లు ఓడిపోయారు.

ఓడిన బీజేపీ నేతలు

ఓడిన బీజేపీ నేతలు


బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, రామచంద్ర రావు, చింతల రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు ఓడిపోయారు. కాగా, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. రాములు నాయక్ (వైరా), చందర్ (రామగుండం).

రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే?

రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే?

ఓడిపోకముందు, కొడంగల్ నియోజకవర్గంలో తాను వెనుకంజలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని చెబుతూనే తెరాసపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో కూర్చొని చర్చిస్తామన్నారు. అక్రమాలు జరిగాయా, తెరాస ఏమేరకు అక్రమాలకు పాల్పడిందనే విషయమై సమగ్రంగా చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు తెరాసకు అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తానని చెప్పారు. 1956 నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో 45 నుంచి 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. గెలుపోటములను ఒకే విధంగా తీసుకుంటామని చెప్పారు. గెలుపును రాష్ట్రాన్ని దోచుకోవడానికి, కుటుంబ ఆధిపత్యానికి ప్రజలు ఇచ్చి లైసెన్సుగా భావించవద్దని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపేవిదంగా చూడాలన్నారు.

English summary
Telangana Congress working president Revanth Reddy lost election from Kodangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X