వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవును! నయీంను వాడుకున్నాం: మాజీ అధికారి, ఉమకు అండగా రేవంత్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎస్ఐబీ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) మాజీ అధికారి మనోజ్ తివారీ గురువారం నాడు స్పందించారు. నయీంను తాము వాడుకున్నామని చెప్పారు. అతనిని ఇన్‌ఫార్మర్‌గా వాడుకున్నందుకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించేవారిమని చెప్పారు.

ఇలా చాలామందిని వాడుకున్నామన్నారు. నా తర్వాత కూడా వాడుకొని ఉంటారని చెప్పారు. నయీంను అధికారికంగా వాడుకున్న అనంతరం నయీంతో తమకు ఎలాంటి కాంటాక్ట్ లేదన్నారు. కాగా, తివారీ గతంలో ఇన్వెస్టిగేషన్ చీఫ్‌గా పని చేశారు.

టిడిపి కుట్రపై సందీప్, మీడియాకే ఉమామాధవ రెడ్డి షాక్టిడిపి కుట్రపై సందీప్, మీడియాకే ఉమామాధవ రెడ్డి షాక్

ఉమా మాధవ రెడ్డి పెంచి పోషించారు: రామలింగా రెడ్డి

నయీం లాంటి వారిని పెంచి పోషించింది ఉమా మాధవ రెడ్డి అని తెరాస నేత, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగా రెడ్డి ఆరోపించారు. నయీం తనను కూడా బెదిరించాడని చెప్పారు. కానీ తాను నయీంకు భయపడకుండా ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. నయీంపై ఫిర్యాదు చేశానని చెప్పారు.

Revanth Reddy demands to judicial enquiry

నయీంను ఉమా మాధవ రెడ్డి లాంటి వారు పెంచి పోషిస్తే, కాంగ్రెస్ పార్టీ విటమన్ ఇచ్చి అతనిని మరింత బలపరిచిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసినందుకే నయీంను ఎన్ కౌంటర్ చేశారనే వాదనలో నిజం లేదన్నారు. తాను ఇరవై ఏళ్ల క్రితమే అమరుడిని కావాల్సి ఉందని, కానీ అదృష్టం బాగుండి బతికి బయటపడ్డానని చెప్పారు.

నయీం కేసులో 9మంది నిందితులు

నయీం కేసులో వనస్థలిపురం పోలీసులు 9 మందిని నిందితులుగా చేర్చారు. ఏ1గా నయీం, ఏ3గా శ్రీధర్ రెడ్డి, ఏ9గా బలరాంను చేర్చారు. వీరి పైన 120బి, ఆయుధాల చట్టం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు.

టిడిపి నేతల కుట్ర ఉండొచ్చు: సందీప్, మీడియాకే ఉమామాధవ రెడ్డి షాక్ టిడిపి నేతల కుట్ర ఉండొచ్చు: సందీప్, మీడియాకే ఉమామాధవ రెడ్డి షాక్

నయీం ఎన్‌కౌంటర్ పైన రేవంత్ రెడ్డి

నయీం ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించాలని టిడిపి నేత రేవంత్ రెడ్డి గురువారం డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని కోరారు.

ఎలిమినేటి మాధవ రెడ్డి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందన్నారు. రాజకీయంగా అడ్డు తొలగించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. దాదాపు 35 సంవత్సరాలపాటు నిస్వార్ధ సేవ చేసిన వ్యక్తి మాధవ రెడ్డి అన్నారు. మాధవ రెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేకుండా సాగిందన్నారు.

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎస్ఐబీ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) మాజీ అధికారి మనోజ్ తివారీ గురువారం నాడు స్పందించారు. నయీంను తాము వాడుకున్నామని చెప్పారు. అతనిని ఇన్‌ఫార్మర్‌గా వాడుకున్నందుకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించేవారిమని చెప్పారు.

English summary
Telanana TDP leader Revanth Reddy demands to judicial enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X