హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభతో ఆత్మరక్షణలో టీఆర్ఎస్: రేవంత్, దుమ్ముదులిపిన డీకే అరుణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, డీకే అరుణలు సోమవారం నిప్పులు చెరిగారు. ప్రగతి నివేదన సభతో తెలంగాణ రాష్ట్ర సమితి ఆత్మరక్షణలో పడిందని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం అన్నారు. కొంగర్ కలాన్ సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు.

Recommended Video

కేసీఆర్ ప్రసంగాన్ని తప్పుబట్టిన రేవంత్ రెడ్డి

ప్రగతి నివేదన సభకు 25 లక్షల మందిని పిలుస్తామని చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. కానీ ఈ సభకు రెండున్నర లక్షల మంది కూడా రాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బిగ్ షో చేయాలనుకున్నారని, కానీ అది ఫ్లాప్ షోగా మారిందన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఖేల్ ఖతం అయిందన్నారు.

Revanth Reddy, DK Aruna fire at TRSs Pragathi Nivedana Sabha

సభ ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి జోష్ లేదన్నారు. నిరుద్యోగులకు, దళితులకు ఏం చేశారో చెప్పలేదన్నారు. తెరాస సర్కారును ఇంటికి పంపించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌కే స్పష్టత లేదన్నారు. రెండో విడత రైతు బంధు చెక్కులు ఇచ్చాకే ఎన్నికలకు పోవాలనుకుంటున్నారని విమర్శించారు.

కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో లోపాయికారి ఒప్పందం ఉందని చెప్పారు. ఇక్కడ మోడీని తిడతారని, ఢిల్లీకి వెళ్లి ఆయన కాళ్లపై పడతారని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అన్నారు. ఈ నెల 12న లేదా 15న మహబూబ్ నగర్‌లో బీజేపీ ఎన్నికల శంఖారావం ఉంటుందన్నారు.

English summary
Telangana Congress MLAs Revanth Reddy, DK Aruna fire at TRS's Pragathi Nivedana Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X