వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు వలసవాది కాదా? ఎక్కడ్నించి వాచ్చారో తెలీదా?: కేసీఆర్‌పై రేవంత్

|
Google Oneindia TeluguNews

జయశంకర్‌ భూపాలపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై టీడీపీ వర్కింట్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గొత్తికోయలు ఇక్కడి వాళ్లు కాదంటూ వారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక, కేసీఆర్‌ వలస వాది కాదా? ప్రశ్నించారు.

సెప్టెంబర్ 16న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జనగలాంచ అటవీప్రాంతంలోని గొత్తికోయలుపై అటవీశాఖాధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సోమవారం గొత్తికోయలు గూడేన్ని టీడీపీ నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి సందర్శించారు.

Revanth Reddy fires at KCR for Gotti koyas issue

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తున్న గొత్తికోయలుపై అమానుషంగా దాడులు చేస్తున్నారన్నారు. అటవీశాఖ అధికారుల దాడుల తీరుపై గూడెం వాసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ పూర్వీకులు బీహార్‌ రాష్ట్రం నుంచి విజయనగరం వచ్చి అక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చినవారేనని రేవంత్ అన్నారు. ఆయన కొడుకు కూడా గుంటూరులో చదువుకొని అమెరికాకు వెళ్లాడని చెప్పారు.

అడవిని నమ్ముకుని వనంలో బతికే గిరిజనులను వెళ్లగొట్టే హక్కులేదన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో గొత్తికోయలు విషయాన్ని లేవనెత్తుతానని అన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రి చందూలాల్‌, స్పీకర్‌ మధుసూదనాచారి ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.

English summary
TDP MLA Revanth Reddy on MOnday fired at Telangana CM K Chandrasekhar Rao for Gotti koyas issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X