వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలు

తెలుగుదేశం పార్టీ పైన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం తీవ్ర సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏపీ టిడిపి నేతలను, తెలంగాణ సీఎం కేసీఆర్ దుమ్ము దులిపారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పైన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం తీవ్ర సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏపీ టిడిపి నేతలను, తెలంగాణ సీఎం కేసీఆర్ దుమ్ము దులిపారు.

చదవండి: కాంగ్రెస్ ముందు రేవంత్ రెడ్డి 'కీలక' ప్రతిపాదనలు, దూకుడుకు చంద్రబాబు అడ్డుకట్ట

ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ నేతల పైన దుమ్మెత్తి పోశారు. కేసీఆర్‌ను ఏపీ టిడిపి నేత పయ్యావుల కేశవ్ కలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

చదవండి: నిప్పు పెట్టిన కెసిఆర్‌, బాబు దోస్తీ: రేవంత్ రెడ్డికి అనివార్యం?

ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలపై కూడా నిప్పులు చెరిగారు. ఏపీ టిడిపి నేతలు అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారన్నారు.

చదవండి: బాబూ! మాకు అవకాశమివ్వు, పార్టీల్లేవు: రేవంత్, అపాయింట్‌మెంట్‌పై నో, చేరికపై సస్పెన్స్

తెలంగాణలో ఏపీ మంత్రులకు పని ఏమిటని ప్రశ్నించారు. సీతక్క కొడుకు పెళ్లికి చంద్రబాబు వచ్చినప్పుడు తెలంగాణ మంత్రులు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదన్నారు.

చదవండి: అంతలోనే.. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంతర్యం: అసలేం జరిగింది?

కేసీఆర్‌కు పయ్యావుల కేశవ్ వంగివంగి నమస్కరించారు

కేసీఆర్‌కు పయ్యావుల కేశవ్ వంగివంగి నమస్కరించారు

ఏపీ టిడిపి నేత పయ్యావుల కేశవ్ అనంతపురం వచ్చిన తెలంగాణ సీఎం కెసిఆర్‌కు వంగి వంగి నమస్కారాలు పెట్టారని దుయ్యబట్టారు. పయ్యావులను ఏపీ ప్రజలు తిరస్కరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పయ్యావులకు ఉన్నదేంటి, నేను తిట్టాల్సిందేంటి అన్నారు.

యనమలకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు

యనమలకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు

ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు కేసీఆర్ రూ.2వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని రేవంత్ మండిపడ్డారు. యనమల పైన కేసీఆర్ ఈగ వాలనిస్తారా అని నిలదీశారు.

 పరిటాల కుటుంబానికి బీర్ల కంపెనీ తయారీ లైసెన్స్

పరిటాల కుటుంబానికి బీర్ల కంపెనీ తయారీ లైసెన్స్

పరిటాల కుటుంబానికి హైదరాబాదులో బీర్ల కంపెనీ తయారీ లైసెన్స్ ఎలా వచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. వీటికి ఏపీ టిడిపి నేతలు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ఏపీ టీడీపీ నేతలకు లబ్ధి చేకూరుస్తున్నారని అభిప్రాయపడ్డారు.

మమ్మల్ని జైల్లో పెడుతుంటే ఏపీ నేతలు దండం పెడతారా

మమ్మల్ని జైల్లో పెడుతుంటే ఏపీ నేతలు దండం పెడతారా

ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ తమను జైల్లో పెడుతుంటే ఏపీ నేతలు ఆయనకు దండం పెట్టడం విడ్డూమని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు అనంతపురంలో అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన నిలదీశారు. పరిటాల సునీత ఇంట్లో పెళ్లికి వెళ్తే అంతలా గౌరవం ఇవ్వాలా అన్నారు.

చంద్రబాబు వస్తే పట్టించుకోలేదు

చంద్రబాబు వస్తే పట్టించుకోలేదు

ఏ పరిటాల శ్రీరామ్ పెళ్లిలో అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గౌరవం లభించిందో అదే పెళ్లిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పట్టించుకున్న వారు లేకుండా పోయారని రేవంత్ మండిపడ్డారు.

ఏపీలో టిడిపితో పొత్తుపై తేల్చుకున్న బిజెపి

ఏపీలో టిడిపితో పొత్తుపై తేల్చుకున్న బిజెపి

ఏపీలో పొత్తులపై బిజెపి ఎప్పుడో స్పష్టతకు వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. తద్వారా బిజెపి 2019లో ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తుందని, చంద్రబాబుతో కలవదని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో బిజెపి లేదు

తెలంగాణలో బిజెపి లేదు

ఇక తెలంగాణలో తమ పార్టీ లేదని బిజెపికి అర్థమైందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ విషయం అర్థమైంది కాబట్టే సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు కలిసి పని చేశాంగా

అప్పుడు కలిసి పని చేశాంగా

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి టిడిపి పని చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి ఎన్నికలప్పుడు, ఉద్యమాల సమయంలో కలిసి పని చేశామని, అలాంటప్పుడు 2019లో పొత్తులు పెట్టుకునే పరిస్థితి వస్తే కలిస్తే తప్పేమిటని నిలదీశారు.

English summary
Telangana TDP working president Revanth Reddy hot comments on Yanamala, Paritala, Payyavula Keshav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X