వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ..స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదు : సోషల్ మీడియాలో పోస్ట్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫాంహౌస్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కు హైకోర్టు స్టే ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రభుత్వ అవినీతిని నిలదీస్తున్నందుకు, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తనను నిర్బంధానికి గురి చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇక సోషల్ మీడియా వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదన్నారు.

తెలంగాణ రాష్ట్రం నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతున్నదన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతున్నదన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం నేడు ఖాకీల పహారా మధ్య నలిగిపోతున్నదంటూ వ్యాఖ్యానించారు. నిర్బంధాన్ని ఛేదించడం కోసం స్వేచ్ఛ సంఘర్షిస్తోంది అంటూ ఆయన పేర్కొన్నారు.గాంధీ లో వైద్యుల ఆవేదన వినడానికి వెళ్తానంటే రాజ్యం అనుమతి ఇవ్వనంటోంది అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. యువరాజు ఫాంహౌస్ అక్రమాల విచారణ పై స్టే వచ్చినంత మాత్రాన అన్యాయం గెలిచినట్టు కాదు అని ఆయన పేర్కొన్నారు.

ప్రజా ఉద్యమం మొదలవ్వాల్సిందే! అంటూ ఆసక్తికర పోస్ట్

ప్రజా ఉద్యమం మొదలవ్వాల్సిందే! అంటూ ఆసక్తికర పోస్ట్


ఇక ప్రజలకు ఈ విషయం అర్థమయ్యేలా చెబుదామంటే మీడియా సమావేశం పెట్టే పరిస్థితి కూడా తెలంగాణలో లేదు అని ఆయన పేర్కొన్నారు. తెలతెల్లవారుతూనే ఇంటి ముందు పోలీసుల కవాతు. హౌస్ అరెస్టులు... ఇక లాభం లేదు ప్రజా ఉద్యమం మొదలవ్వాల్సిందే! అంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చేశారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే సమయంలో ఈరోజు రేవంత్ రెడ్డి ని ఇంటి నుండి బయటకు రానివ్వకుండా ఖాకీల పహారా కాస్తున్న నేపధ్యంలో పోలీసులతో ఆయన తనను బయటకు వెళ్లనివ్వమని తనకు పనులు ఉన్నాయి అని, ప్రజలను ఓట్లు వేసే ప్రజాప్రతినిధిగా గెలిపించింది ఇంట్లో కూర్చోడానికి కాదంటూ ఆయన మాట్లాడారు.

బయటకు వెళ్ళేందుకు అనుమతించని పోలీసులు

బయటకు వెళ్ళేందుకు అనుమతించని పోలీసులు


బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు మా ప్రాబ్లం మీకు తెలుసు కదా సార్ అంటూ ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఇక రేవంత్ రెడ్డి నీ డ్యూటీ నువ్వు చేసినట్టేనా డ్యూటీ నేను కూడా చెయ్యాలి కదా అంటూ పోలీసులు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద డాక్టర్ల ధర్నా జరుగుతోందని తన అక్కడికి వెళ్లాలని, అలాగే తాను ఒక ప్రెస్ మీట్ కి వెళ్లాల్సిన పని ఉందని, తనను వెళ్లనివ్వాలని, లేదా పోలీస్ వెహికిల్ లో అయినా తనను తీసుకుని వెళ్లాలని ఆయన పోలీసులను కోరారు.

బయటకు వెళ్తే ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటో చెప్పాలన్న రేవంత్

బయటకు వెళ్తే ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటో చెప్పాలన్న రేవంత్

ఇక తను బయటకు వెళ్తే ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది ఏంటో చెప్పాలంటూ రేవంత్ ప్రశ్నించారు. కొట్లాడితే కొట్లాడారు అంటున్నారు. కొట్లాడకుంటే మీరు పోనీరు అంటూ రేవంత్ రెడ్డి పోలీసులు ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టే వస్తేనే కేసు అయిపోయినట్టు కాదన్నారు. గృహ నిర్బంధాలకు గురి చేసినంత మాత్రాన ప్రభుత్వ అవినీతిని వదిలిపెట్టేది లేదని చెప్పారు.

English summary
Congress party leader, fire brand Malkajgiri MP and TPCC working president Revanth Reddy reacted to the social media platform on giving a high court stay to Minister KTR in the Janwada farmhouse affair. He said that he was being detained for standing up for government corruption and questioning irregularities. Revanth Reddy, who responded to the social media platform, said that the saty was not enough.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X