వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ వద్ద హరీష్ జాతకం, ఆ రోజు వీడియో బయటపెట్టు: రేవంత్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Revanth Reddy Lashes Out At KCR And Harish Rao : కేసీఆర్ చీప్ లిక్కర్ సీఎం....! | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) రేవంత్ రెడ్డిని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నమ్మడం కల్ల అని, త్వరలో టీఆర్ఎస్ విస్ఫోటనం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయన్నారు. త్వరలో తెరాస అనే కుండ బద్దలవుతుందని చెప్పారు.

చంద్రబాబు ఇష్యూ: కేసీఆర్‌కు కోదండరాం దిమ్మతిరిగే కౌంటర్, కూటమి సీట్లపై చాడ వార్నింగ్చంద్రబాబు ఇష్యూ: కేసీఆర్‌కు కోదండరాం దిమ్మతిరిగే కౌంటర్, కూటమి సీట్లపై చాడ వార్నింగ్

అక్టోబర్ 25వ తేదీన రాత్రి హరీష్ రావుతో మూడు గంటల పాటు చర్చించిన తర్వాతే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం గుర్తించాలని అన్నారు. నిప్పుల్లో నడిచినా కూడా హరీష్ రావు తన శీలాన్ని కేసీఆర్ ముందు రుజువు చేసుకోలేని పరిస్థితి అన్నారు. హరీష్ రావు తల కోసుకున్నా.. అది హరీష్ రావు తల కాదని, పుచ్చకాయ అని కేసీఆర్ అంటారని చెప్పారు. అల్లుడి పుట్టుమచ్చల గురించి మేనమామకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

హరీష్ రావు సీసీ ఫుటేజీ బయటపెట్టాలి

హరీష్ రావు సీసీ ఫుటేజీ బయటపెట్టాలి

అక్టోబర్ 25వ తేదీన తన నివాసంలోని సీసీ టీవీ ఫుటేజీలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్, హరీష్ రావుల మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా ఉందన్నారు. హరీష్ రావు జాతకం అంతా కేసీఆర్ వద్ద ఉందని చెప్పారు. కేటీఆర్‌ను సంతృప్తిపరిచేందుకే చంద్రబాబుపై హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పక్షాలు మహా కూటమిగా ఏర్పడటంపై హరీష్ రావు, కేటీఆర్‌ చేస్తున్న విమర్శలు విడ్డూరమన్నారు. తమది ప్రజాకూటమి అని, దానికి వ్యతిరేకంగా వారు రకరకాలుగా మాట్లాడుతున్నారన్నారు.

కేసీఆర్ వద్ద హరీష్ జాతకం

కేసీఆర్ వద్ద హరీష్ జాతకం

హరీష్ ఎలాంటి వ్యక్తో, నమ్మినవాళ్లను ఎలా మోసం చేశారో కేసీఆర్‌కు బాగా తెలుసునని రేవంత్ అన్నారు. అతని జాతకం అంతా కేసీఆర్ వద్ద ఉందని, కేసీఆర్‌ను నమ్మించేందుకే కాంగ్రెస్‌ను, కూటమిని హరీష్ పదేపదే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తుపానుకు ముందు వచ్చే ప్రశాంతతలా తెరాస ఉందా? విచ్ఛిన్నమయ్యే ముందు నిశ్శబ్ధమా? ఈ విషయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 25న సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హరీష్ నివాసంలోకి వెళ్లిన కార్లు, వచ్చిన కార్లు, వాటిలో ఎవరెవరు వచ్చివెళ్లారో వెల్లడిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌తో పాటు తెలంగాణ సమాజానికీ ఓ స్పష్టత వస్తుందన్నారు.

 కేటీఆర్ అలా చెప్పారు, హరీష్ ఇలా

కేటీఆర్ అలా చెప్పారు, హరీష్ ఇలా

చంద్రబాబు నీళ్ల విషయంలో ఏదో లేఖలు రాశారని హరీష్ రావు చెబుతున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు తమ హక్కుగా వచ్చే నీటి వినియోగాన్ని చట్టబద్ధంగా వినియోగించుకున్నప్పుడు ఏపీ అధికారులు కేంద్రానికి లేఖలు రాసినా, కోర్టుకు వెళ్లి కేసులు వేసినా ఫలితం ఉండదని రేవంత్ అన్నారు. అంటే చంద్రబాబు ఏం చేసినా దాని వల్ల మనకు నష్టం జరగదని చెప్పారు. ఇటీవల కేటీఆర్ నిజాంపేటలో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో లేఖలు రాసి ఉండవచ్చునని, ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటామని చెప్పారని, ఆయన లేఖల్లో ఆ వైపు నుంచి చూస్తే తప్పుకాకపోవచ్చునని చెప్పారని, హరీష్ రావు మాత్రం మరోలా మాట్లాడుతున్నారన్నారు. ఇది కేసీఆర్, కేటీఆర్‌లను సంతోషపెట్టేందుకే అన్నారు.

 అర్ధరాత్రి 1 గంటల వరకు ఏం జరిగింది

అర్ధరాత్రి 1 గంటల వరకు ఏం జరిగింది

టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయని రేవంత్ అన్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తుపాను ముందు కనిపించే ప్రశాంతతలా ఉందన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు పన్నడంలేదని, అంతా కలిసే ఉన్నామని చెప్పాలనుకుంటే గత నెల 25న సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి ఒకటి గంట వరకు మంత్రుల క్వార్టర్స్‌లో ఉన్న సీసీ కెమెరాలు, హరీష్ ఇంటి ముందు ఉన్న ఫుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వాటిని మీడియాకు అందుబాటులో ఉంచాలన్నారు. కుటుంబంలో అంతర్గత శత్రుత్వాన్ని, కక్షలను సాధించుకునేందుకు ప్రజలను ఉపయోగించుకోవాలనుకుంటే ఊరుకునేది లేదన్నారు.

 గత చరిత్ర చూస్తే తెలుస్తుంది

గత చరిత్ర చూస్తే తెలుస్తుంది

సీల్డు కవర్ సీఎం అని తెరాస నేతలు చెబుతున్నారని, కానీ కేసీఆర్ మాత్రం చీప్ లిక్కర్ సీఎం అని రేవంత్ అన్నారు. చంద్రబాబు లేఖలపై తెరాస నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని సీఎంను ఎంపిక చేస్తారన్నారు. గత చరిత్ర చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని చెప్పారు. టీఆర్ఎస్‌లు సీఎంనే కాదు, మంత్రులను కూడా ఎవరి అభిప్రాయం తీసుకొని చేయరని విమర్శించారు.

English summary
Congress working president Revanth Reddy alleged that the relation between the caretaker chief minister and irrigation minister Harish Rao is not going well which is leading to the internal rifts among the leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X