హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి అరెస్ట్?: ఇంటివద్ద భారీ భద్రత, అభిమానుల హల్‌చల్, బయటకు వచ్చి అభివాదం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం వద్ద పోలీస్ ఫోర్స్, అభిమానుల హంగామా చూస్తే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

<strong>ఇదే నా చివరి స్పీచ్ కావొచ్చు, జైలు నుంచి నామినేషన్: రేవంత్ ఉద్వేగం, హైదరాబాద్‌లో ఇంటికి రాక</strong>ఇదే నా చివరి స్పీచ్ కావొచ్చు, జైలు నుంచి నామినేషన్: రేవంత్ ఉద్వేగం, హైదరాబాద్‌లో ఇంటికి రాక

ఆయన ఇంటికి భారీగా చేరుకున్న అభిమానులు రేవంత్ రెడ్డిని చూపించాలని డిమాండ్ చేశారు. వారి ఒత్తిడి కారణంగా శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో రేవంత్ తన ఇంట్లో నుంచి చేతులు ఊపుతూ అభివాదం తెలిపారు. రేవంత్ కనిపించడంతో అభిమానులు సంబరపడ్డారు.

రేవంత్ నివాసం వద్ద అనుచరుల హల్‌చల్

రేవంత్ నివాసం వద్ద అనుచరుల హల్‌చల్

అంతకుముందు,రేవంత్ రెడ్డిని గత రాత్రి నుంచి ఇంట్లోనే ఉంచడం, అతను బయటకు రాకపోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. రేవంత్ నివాసం ఎదుట వందలాది మంది అభిమానులు గుమికూడారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి, తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.

 రేవంత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు

రేవంత్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అంతమంది పోలీసులు రావడంతో అరెస్టు ఊహాగానాలు చెలరేగాయి. దీంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రేవంత్ నివాసం వద్ద ఉన్న పోలీస్ ఫోర్స్ చూస్తుంటే అరెస్టు చేస్తారేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏ క్షణమైనా అరెస్ట్

ఏ క్షణమైనా అరెస్ట్

గురువారం రాత్రి ఏడు గంటలకు ఇంట్లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఏడు గంటలు దాటినా లోపలే ఉన్నారు. ఆయనను అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కొన్ని సందర్భాల్లో ఉదయ్ సిన్హాతో కలిపి విచారించారు. శుక్రవారం రాత్రి ఏ సమయమైనా అతనిని పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

కొనసాగుతున్న సోదాలు

కొనసాగుతున్న సోదాలు

అంతకుముందు, రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాలు శుక్రవారం కూడా కొనసాగాయి. రేవంత్, అతని సతీమణి గీత, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లాకర్లపై ఆరా తీశారు. కంప్యూటర్లలో డిలీట్ చేసిన సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్ సమాచారాన్ని సేకరించింది. రేవంత్ సతీమణి గీతను 3 బ్యాంకులకు తీసుకెళ్లి, లాకర్ల వివరాలు తెలుసుకున్నారు.

English summary
Telangana Congress leader and Former Kodangal MLA Revanth Reddy may arrest today from his home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X