• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీజీ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ విచారణ ఏమైంది? రేవంత్ రెడ్డి బహిరంగలేఖ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ బహిరంగ లేఖ రాశారు. మోడీ జీ నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ తొమ్మిది ప్రశ్నలతో లేఖాస్త్రాన్ని సంధించిన రేవంత్ రెడ్డి మోదీజీ... ఐఎస్బీ స్నాతకోత్సవంలో విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నించకూడదని వాళ్ల నేపథ్యాలను భూతద్దంలో వెతికి మరీ ప్రవేశానికి అనుమతించారు. ఇక తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్నా... కనీసం ఈ ప్రశ్నలకైనా జవాబు చెబుతారా!? అంటూ నిలదీశారు.

తెలంగాణా సమాజానికి ఇప్పటికైనా క్షమాపణ చెప్తారా?

తెలంగాణా సమాజానికి ఇప్పటికైనా క్షమాపణ చెప్తారా?

రేవంత్ రెడ్డి ప్రశ్నించిన ప్రశ్నాస్త్రాలను చూస్తే తెలంగాణ ప్రజలు అంటే మీకు ఎందుకు చులకన అంటూ ప్రశ్నించారు. గడిచిన పార్లమెంట్ సమావేశాల సందర్భంలో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గాయ పరుస్తూ మీరు మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమైన మాటలను ఇప్పటికైనా వెనక్కి తీసుకుని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏవి నెరవేర్చారో చెప్పాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరపరు ఎందుకు?

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరపరు ఎందుకు?

అంతేకాదు కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ను కేవలం కమిషన్ ల కోసం కేసీఆర్ రీ డిజైన్ చేశారని మొదటి నుంచి ఆరోపిస్తున్నా, కెసిఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా విమర్శించినా... మీరు ఎందుకు కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిపై సిబిఐ విచారణ జరిపించడం లేదు అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించడానికి మీకు ఇబ్బంది ఏమిటి అంటూ నిలదీశారు. ఏ చీకటి స్నేహం మిమ్మల్ని ఆపుతోంది అంటూ ప్రశ్నించారు.

పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఏమైంది?

పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఏమైంది?

కృష్ణా జలాల విషయంలో కేంద్రం వైఖరికి తోడు కెసిఆర్, జగన్ ఆడుతున్న క్రీడలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని, ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని రేవంత్ రెడ్డి మోడీని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ అతీగతి లేదని పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేశారని దీనిపై స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయం ఏమైంది అని ప్రశ్నించారు.

పసుపుబోర్డు ఎక్కడ? రైతులకు నష్టం చేసింది మీరు కాదా?

పసుపుబోర్డు ఎక్కడ? రైతులకు నష్టం చేసింది మీరు కాదా?

నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఏమైందని రేవంత్ రెడ్డి నిలదీశారు. అంతేకాదు ఐటీఐఆర్ రద్దు చేశారని, స్టీల్ ఫ్యాక్టరీ ఊసే లేదని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మీ దృష్టిలో ఎందుకు అంత అప్రాధాన్యత ఉంది అని ప్రశ్నించారు. ఒడిశాలోని నైని కోల్ మైన్స్ టెండర్ల కుంభకోణంలో కేసీఆర్ బంధువుల పాత్ర ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు .. ఎందుకు అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో డ్రామాలాడి రైతులకు నష్టం చేసింది మీరు కాదా? అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ పై ఈగ వాలకుండా కాపాడుతుంది మీరు కాదా ?

కేసీఆర్ పై ఈగ వాలకుండా కాపాడుతుంది మీరు కాదా ?

కెసిఆర్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నది మీరు కాదా అంటూ మోడీని నిలదీశారు. రైతుల చావులకు బాధ్యులు మీరు కాదా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు. రామాయణ సర్క్యూట్లో భద్రాద్రి రాముడుకి చోటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఏం చేయబోతుందో చెప్పాలని రేవంత్ రెడ్డి మోడీకి సూటి ప్రశ్నలు వేశారు.

English summary
Revanth Reddy questioned modi, in the wake of Prime Minister Modi visit in hyderabad, where is the CBI probe into the Kaleswaram project corruption. Demanded to be answered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X