వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్ నుంచే: కేసీఆర్‌పై రేవంత్, జిల్లాల్లో అమల నుంచి తలసాని దాకా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పదవి నుంచి దింపడమే తన లక్ష్యమని చెప్పిన తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పర్యటనలతో బిజీగా ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పదవి నుంచి దింపడమే తన లక్ష్యమని చెప్పిన తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పర్యటనలతో బిజీగా ఉన్నారు.

ఆయన సోమవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ‌లో దొంగ‌ల రాజ్యం న‌డుస్తోంద‌న్నారు.

చదవండి: నేను ముఖ్యమంత్రిని అయ్యాక..: రెడ్డిలకు రేవంత్ రెడ్డి బంపరాఫర్

మూడేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి అప్పులే మిగిలాయన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెర‌వేర్చ‌లేక‌పోయార‌ని, తెలంగాణ‌లో ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నీళ్లు లేవన్నారు. మెదక్ జిల్లా నుంచే తెరాస పతనం మొదలు కావాలన్నారు.

బందువుల పేకాట క్లబ్‌లపై కేసీఆర్‌కు సవాల్

బందువుల పేకాట క్లబ్‌లపై కేసీఆర్‌కు సవాల్

అంతకుముందు కొడంగల్‌లో నిర్వహించిన మహానాడులో, ఇతర సభల్లో కేసీఆర్‌పై రేవంత్ నిప్పులు చెరిగారు. జూదం, గుట్కాలపై ఉక్కుపాదం మోపుతానని చెబుతున్న సీఎం కేసీఆర్‌ ముందుగా తన బంధువులు నిర్వహిస్తున్న పేకాట క్లబ్బులను మూయించాలని సవాల్ చేశారు.

జూదం ఎలా నిలిపేస్తారు?

జూదం ఎలా నిలిపేస్తారు?

రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించడం ఖాయమని, అందుకోసమే టిడిపి కంకణం కట్టుకుందని రేవంత్ అన్నారు. టిడిపి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకొందన్నారు. కేసీఆర్‌ బంధువులే స్వయంగా కరీంనగర్‌ చౌరస్తాలో క్లబ్బులు నడుపుతుంటే ఇక జూదం ఎలా నిలిపివేస్తారన్నారు.

తలసానిపై కామెంట్

తలసానిపై కామెంట్

కరీంనగర్‌ క్లబ్‌ను మూయించడానికి వెళ్లిన కమిషనర్‌ను చొక్కాపట్టి బయటకు గెంటి వేశారని రేవంత్ అంటున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి వియ్యంకుడు గుట్కా వ్యాపారాన్ని గుప్పెట్లో ఉంచుకొని నడిపించడంలేదా? అని ప్రశ్నించారు. గుట్కా గురించి మరింతగా తెలియాలంటే గుట్కా వేసుకొని అసెంబ్లీకి వస్తున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను చూడొచ్చని ఎద్దేవా చేశారు. పోలీసులను ప్రచారాస్త్రంగా వాడుకొన్నట్లు పోలీసు సదస్సులో కేసీఆర్‌ స్వయంగా చెప్పారన్నారు.

అంతకుముందు..

అంతకుముందు..

రేవంత్ రెడ్డి ఆంధ్రా అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అక్కినేని అమలక హైదరాబాదులో కుక్కల సంరక్షణ కోసం మూడెకరాలు ఇచ్చారని, గోర్రెలు, మేకల పెంపకందారులకు భూములు ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రావడం లేదని రేవంత్ విమర్శించిన సందర్భాలున్నాయి.

English summary
Telangana Telugudesam Party MLA Revanth Reddy participates Mini Mahanadu in Sangareddy, fires at KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X