హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆచార్య జయశంకర్ స్వగ్రామానికే ఇలాంటి పరిస్థితా?: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పలు సమస్యలను ప్రస్తావిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని రేవంత్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా... జయశంకర్ స్వగ్రామంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కానరావడంలేదన్నారు.

ఎంతోమంది ప్రజాప్రతినిధులు అక్కంపేట గ్రామాన్ని సందర్శించి ఊరు బాగుకోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని రేవంత్ విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా అక్కంపేట గ్రామం నోచుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికీ రెవెన్యూ విలేజ్‌ హోదా ఇవ్వకపోవడం అత్యంత విచారకరమని తెలిపారు. అక్కంపేట ఇప్పటికీ పెద్దాపూర్ గ్రామ పరిధిలోనే కొనసాగుతుండటం క్షమించరాని అంశమని అన్నారు.

Revanth Reddy public letter to telangana CM KCR on akkampet village development and land pooling issue

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా అక్కంపేటలోని నిరుపేద దళితుడు చిలువేరు జానీ కుటుంబంతో కలిసి భోజనం చేశానని... చాలా దీనమైన పరిస్థితుల్లో కుటుంబం జీవనం సాగిస్తోందన్నారు. వారికి కనీసం సొంత ఇళ్లు సైతం లేదని తెలిపారు. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు రేవంత్. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్​రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ సిద్ధాంత కర్త అయిన జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేదంటే పల్లె ప్రగతిలోని డొల్లతనం అర్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే అక్కంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ పేరిట స్మృతివనం నిర్మించాలని డిమాండ్ చేశారు రేవంత్. ల్యాండ్
మరోవైపు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ (కుడా) ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధమైందన్నారు.

ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వెనక్కి తీసుకుంటున్నట్లు కింది స్థాయి నాయకులు చేస్తున్న ప్రకటనలు రైతుల్లో విశ్వాసం నింపడం లేదన్నారు రేవంత్. ఈ నేఫథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో సంబంధిత జీవోను వెనక్కి తీసుకుంటునట్లు మీరు స్పష్టమైన ప్రకటన చేస్తే వారిలో ఆందోళన తగ్గి నిశ్చితంగా ఉంటారన్నారు రేవంత్. లేదంటే, ఆ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని... ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే దాకా పోరాటం సాగిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

English summary
Revanth Reddy public letter to telangana CM KCR on akkampet village development and land pooling issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X