వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా..! రాహుల్ స్పూర్తితో పనిచేస్తానన్న రేవంత్‌రెడ్డి.

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా | Revant Reddy Resigned To His Post

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసేకున్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లో అలాంటి పదవిని కావాలనుకుంటారు. ఏళ్ల తరబడి ఆ పదవికోసం ఎదురు చూస్తుంటారు. కాని పార్టీ భవిశ్యత్ ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం తీసుకున్నానని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పుకొస్తున్నారు. తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రేవంత్ రెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన రేవంత్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన హైదరాబాద్‌లోని 'మల్కాజ్‌గిరి' నుంచి కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దింపింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో.. టీఆర్ఎస్ హవాలోనూ రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచి నిలిచారు. అంతేకాదు.. కొద్దిరోజుల క్రితం పార్లమెంట్‌లో వెరైటీగా రేవంత్ ప్రమాణ స్వీకారం సైతం చేశారు.

Revanth Reddy Resigned for Congress Working President..!

రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడంతో.. అంతకు మునుపు తనకున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. శనివారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ భవిష్యత్‌ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానన్నారు. పార్టీలో పదవి లేకపోయినా కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. యువరాజు రాహుల్‌ స్ఫూర్తితో రాజీనామా చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరికిస్తారు..? ఈ కీలక బాధ్యతలు అందుకునే నేత ఎవరు..? అనే విషయాలపై కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సమావేశమై ఆ నేత ఎవరన్న విషయం నిశితంగా చర్చించి అధిష్టానానికి లేఖ పంపనుందని.. ఆ తర్వాతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరనేది కాంగ్రెస్ నియమిస్తుందని తెలుస్తోంది.

English summary
Malkaj giri congress mp Revant Reddy resigned to his congress working president post in Telangana.His resignation letter was sent to the High Command on Saturday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X