వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి సోదరుడు కన్నుమూత: చంద్రబాబు-లోకేష్ దిగ్భ్రాంతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువ నేత, కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణా రెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. కృష్ణా రెడ్డి వయస్సు 62. అతను కల్వకుర్తిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కృష్ణా రెడ్డి ప్రస్తుతం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో నివసిస్తున్నారు.

కాగా, కృష్ణారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రోజులానే స్నానం చేసి బయటకు వెళ్లిన కృష్ణారెడ్డి కొద్దిసేపటి తర్వాత ఛాతీలో నొప్పి వస్తోందని ఇంటికి తిరగొచ్చేశారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

చంద్రబాబు, లోకేష్ సంతాపం

రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతి పట్ల టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టిడిపి యువనేత నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

హైదరాబాదులో ఒకరి దారుణ హత్య

హైదరాబాదులోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాం కోఠీలో కారులో వెళ్తున్న వ్యక్తి పైన ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. బొగ్గుల కుంటకు చెందిన పాత ద్విచక్ర వాహనాల వ్యాపారి షేక్ ఖాదర్ భాషాను కొందరు వ్యక్తులు వేటకొడవళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి హతమార్చారు.

Revanth Reddy's brother Krishna Reddy dies

మృతుడికి అఫ్రీన్ అనే యువతితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఏడాది క్రితం అఫ్రీన్‌కు విడాకులు ఇచ్చాడని తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన వారు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అనే పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ హత్య ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో జరిగింది. రాత్రి అతను వ్యాపారం ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరుతున్న సమయంలో కొందరు వ్యక్తులు అతడి కారును అడ్డగించి కారులో నుంచి ఖాదర్ బాషను బయటకు లాగి వేట కొడవళ్లతో నరికేశారు.

మెదక్ జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య

మెదక్ జిల్లా కేంద్రంలో అప్పుల బాధతో ఓ రైతు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కౌలు రైతు అని తెలుస్తోంది.

English summary
Telangana Telugudesam party leader Revanth Reddy's brother Krishna Reddy dies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X