వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే టీడీపీతో పొత్తు, కేసీఆర్! టీడీపీపై అప్పుడు గుర్తుకు లేదా: రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దెయ్యం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని, ఆ దెయ్యాన్ని వదిలించేందుకు కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ జతకట్టిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

బుధవారం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీని ఆంధ్రా పార్టీ అని విమర్శించిన కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశాలు ఇచ్చింది అదే తెలుగుదేశం పార్టీ కాదా అన్నారు.

చంద్రబాబుతో మీ కలయిక మాటేమిటి? అందుకే టీడీపీతో: కేసీఆర్‌ను దులిపేసిన విజయశాంతిచంద్రబాబుతో మీ కలయిక మాటేమిటి? అందుకే టీడీపీతో: కేసీఆర్‌ను దులిపేసిన విజయశాంతి

Revanth Reddy says from which party kcr came?

అప్పుడు ఆ పార్టీ ఆంధ్రా పార్టీ కాదా చెప్పాలని నిలదీశారు. టీడీపీ తెలంగాణలోనే పుట్టిందన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కలిస్తే టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవని, అదే భయంతో మహాకూటమిపై కేసీఆర్‌ విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇంటింటికీ నల్లా, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాటిని నెరవేర్చితే కేసీఆర్‌ ఇంట్లో కూర్చున్నా ప్రజలు బ్రహ్మరథం పట్టే వారని చెప్పారు. ఏ ఒక్క హామీ నెరవేర్చనందుకే కేసీఆర్‌ను గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు.

English summary
Telangana Congress working president Revanth Reddy on Thursday said from which party K Chandrasekhar Rao came.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X