వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! మాకు అవకాశమివ్వు, పార్టీల్లేవు: రేవంత్, అపాయింట్‌మెంట్‌పై నో, చేరికపై సస్పెన్స్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపాయింటుమెంట్ తాను అడిగానన్న వార్తలు అవాస్తవమని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్తున్నారని, ఆయన తిరిగి వచ్చా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపాయింటుమెంట్ తాను అడిగానన్న వార్తలు అవాస్తవమని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.

ఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలుఏపీ టిడిపి దుమ్ము దులిపారు: కాంట్రాక్టులు, కేసీఆర్, పరిటాల, యనమల.. రేవంత్ మనసు నుంచి సంచలనాలు

చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్తున్నారని, ఆయన తిరిగి వచ్చాక కలుస్తానని చెప్పారు. చంద్రబాబును అపాయింటుమెంట్ తాను ప్రస్తుతానికి అడగలేదన్నారు.

చంద్రబాబు మాకు అవకాశం ఇవ్వాలి

చంద్రబాబు మాకు అవకాశం ఇవ్వాలి

రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏపీ టిడిపి నేతలపై ధ్వజమెత్తిన రేవంత్.. చంద్రబాబును మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అదే సమయంలో తెలంగాణలో స్థానిక పరిస్థితులను బట్టి పొత్తు పెట్టుకునే అవకాశం తమకు ఇవ్వాలన్నారు.

పొత్తు తప్పేమిటి

పొత్తు తప్పేమిటి

గతంలో ఉద్యమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేశామని, సింగరేణి ఎన్నికల్లో కలిసి పని చేశామని, అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని నిలదీశారు.

Recommended Video

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu
తెలంగాణలో ఉన్నది కేసీఆర్ - కేసీఆర్ వ్యతిరేక కూటమి

తెలంగాణలో ఉన్నది కేసీఆర్ - కేసీఆర్ వ్యతిరేక కూటమి

తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏ పార్టీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉన్నది కేసీఆర్, కేసీఆర్ వ్యతిరేక కూటమి మాత్రమే అన్నారు. ఏ పార్టీ ప్రత్యేకంగా లేదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యతిరేక కూటమి పునరేకీరణకు నాయకత్వం వహిస్తానని చెప్పారు. ముందు ముందు కేసీఆర్ కూటమి, రేవంత్ రెడ్డి కూటమి అవుతుందని అభిప్రాయపడ్డారు.

అందుకే ఢిల్లీకి వెళ్లా

అందుకే ఢిల్లీకి వెళ్లా

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులపై కేసులు వేసేందుకే తాను ఢిల్లీకి వెళ్లానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కూలీ పనుల పేరుతో మంత్రుల వసూళ్లపై తాను ఈసీ, ఏసీబీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇంకా సస్పెన్స్

కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇంకా సస్పెన్స్

ఏపీ టిడిపి నేతలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మాత్రం ఏమీ అనలేదు. అదే సమయంలో తెలంగాణలో పొత్తుల బాధ్యతను తమకే వదిలేయాలని రేవంత్ రెడ్డి.. అధినేతకు విజ్ఞప్తి చేశారు. తద్వారా తాను ఇంకా టిడిపికి అనుకూలంగా ఉన్నాననే సంకేతాలు పంపించారు. కానీ కేసీఆర్‌కు ఏపీ టిడిపి నేతలు అనుకూలంగా ఉండటాన్నే తాను వ్యతిరేకిస్తున్నాననే అభిప్రాయం కలిగిస్తున్నారు.

English summary
Telangana TDP working president Revanth Reddy on Wednesday said that he did not ask appointment of AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X