హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్! సిద్ధమా.. లేకుంటే కల్వకుంట్ల వంశంకాదా, కేసీఆర్ తప్పిదానికి ఏడాది జైలు శిక్ష: రేవంత్ షాకింగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Revanth Reddy Challenges KTR : సవాల్ పై నిలబడకుంటే కల్వకుంట్ల వంశమే కాదని భావించవలసి వస్తుంది

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సంచలన ఆరోపణలు చేసారు. అలాగే, మంత్రి (ఆపద్ధర్మ) కేటీ రామారావుకు ప్రతి సవాల్ విసిరారు. ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ రెండుచోట్ల తన ఓటును నమోదు చేసుకున్నారని, కాబట్టి ఆయనను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని, ఎన్నికల ప్రక్రియ చాలా దారుణంగా ఉందని చెప్పారు. కొడంగల్‌లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే కేటీఆర్ తీసుకుంటారా అని సవాల్ విసిరారు.

అనూహ్యమార్పులు ఖాయం!: తెలంగాణలో విజయం ఎవరిది? కేసీఆర్ గ్రహబలం ఏం చెబుతోంది?అనూహ్యమార్పులు ఖాయం!: తెలంగాణలో విజయం ఎవరిది? కేసీఆర్ గ్రహబలం ఏం చెబుతోంది?

కూటమి గెలుస్తోంది

కూటమి గెలుస్తోంది

కక్షపూరితంగా కొందరి ఓట్లు తీసేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో చాలామంది ఓట్లు గల్లంతయ్యాయని చెప్పారు. దాదాపు ఇరవై లక్షల మంది అర్హులైన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని చెప్పారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రజాకూటమి విజయం సాధించబోతుందని చెప్పారు. గెలుపును తమ సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చెప్పారు.

రెండు వేర్వేరు ప్రాంతాల్లో కేసీఆర్‌కు ఓటు

రెండు వేర్వేరు ప్రాంతాల్లో కేసీఆర్‌కు ఓటు

కేసీఆర్ గజ్వెల్‌లో ఫాంహౌస్ వద్ద తన ఓటు హక్కును నమోదు చేయించుకున్నారని, అలాగే మరో ఓటును సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో నమోదు చేయించుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (ఆపద్ధర్మ) ఉన్న కేసీఆర్ కేవలం ఇంటి పేరును, పేరును అటు ఇటు మార్చి రెండుచోటుల ఓటు నమోదు చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రే రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేయించుకోవడం విడ్డూరమన్నారు.

 కేసీఆర్‌కు ఏడాది జైలు శిక్ష విధించాలి

కేసీఆర్‌కు ఏడాది జైలు శిక్ష విధించాలి

లక్షలమందికి ఓటు కల్పించకపోవడం ఒక తప్పు అయితే, ఓ ముఖ్యమంత్రి అయి ఉండి రెండు చోట్ల ఓటును నమోదు చేయించుకోవడం మరో తప్పు అని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఓచోట చంద్రశేఖర రావు కల్వకుంట్ల, మరోచోట కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనే పేరుతో ఓటు నమోదు చేయించుకున్నారని చెప్పారు. చింతమడక, ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రికి ఓటు ఉంటే దానిని ఎన్నికల అధికారులు తొలగించలేదని ప్రశ్నించారు. ఇలా ఉంటే దీని ప్రకారం ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారని, కేసీఆర్‌కు చట్టపరంగా ఆ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

 ఎన్నికల నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉంది

ఎన్నికల నిర్వహణ చాలా లోపభూయిష్టంగా ఉంది

తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేసే వారి ఓట్లు తీసేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల అధికారులు సానుకూలంగా పని చేశారని కేటీఆర్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని చెప్పారు. ప్రజల ఓట్ల తొలగింపు, చంద్రశేఖర రావుకు రెండుచోట్ల ఓటు ఉండటంతోనే ఎన్నికల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా జరిగిందో తేలిపోయిందని రేవంత్ చెప్పారు. ఇందుకు సంబంధించి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

 నేను ఓడితో రాజకీయ సన్యాసం, కేటీఆర్ సిద్ధమా?

నేను ఓడితో రాజకీయ సన్యాసం, కేటీఆర్ సిద్ధమా?

కేటీఆర్ పదేపదే సవాళ్లు విసురుతున్నారని, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ఓడిపోతున్నారని కొడంగల్ నడిబొడ్డుపై ప్రకటించారని రేవంత్ గుర్తు చేశారు. నిన్న (శనివారం) కూడా రేవంత్ ఓడిపోతున్నారని చెప్పారని అన్నారు. నేను కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నానని, కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అలాగే నేను గెలిస్తే కేటీఆర్ కూడా రాజకీయాల నుంచి తప్పుకొని, జరిగిన అవినీతిపై విచారణకు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.

కల్వకుంట్ల వంశమే కాదని భావించవలసి ఉంటుంది

కల్వకుంట్ల వంశమే కాదని భావించవలసి ఉంటుంది

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోను కేటీఆర్ తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి లేరని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒక్క సీటైనా, ఏ సీటైనా.. దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక్క సీటు తక్కువగా వచ్చిందని, కానీ అలాంటప్పుడు కూడా కేటీఆర్ తన సవాల్ పైన నిలబడలేదని చెప్పారు. ఇప్పటికైనా కేటీఆర్ తన సవాల్ పైన నిలబడకుంటే కల్వకుంట్ల వంశమే కాదని భావించవలసి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 11వ తేదీన తెలంగాణ ప్రజలకు పట్టిన పీడ విరగడ అవుతుందని చెప్పారు.

English summary
Telangana Congress working president Revanth Reddy said that Caretaker CM K Chandrasekhar Rao have 2 votes in two places in Siddipet and Gajwel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X