హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ చెప్పినట్లే..!: ఈటల రాజేందర్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని రేవంత్ తెలిపారు. ఆ పార్టీ, కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఆయన మాటల్లోనే స్పష్టమైందని చెప్పారు.

బీజేపీలోనూ కేసీఆర్ కోవర్గులున్నారన్న రేవంత్

బీజేపీలోనూ కేసీఆర్ కోవర్గులున్నారన్న రేవంత్

బీజేపీలో కూడా కేసీఆర్ కోవర్టులు ఉన్నారని.. ఈటల రాజేందర్ పార్టీలో చేరిన తర్వాతనే ఆయనకు అర్థమైందన్నారు రేవంత్. ఇప్పుడు ఆయన లక్ష్యసాధన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ నియంతృత్వ దోరణిని గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరని అన్నారు. బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల మాటల్లో స్పష్టమైందన్నారు. ప్రజలు దీనిపై ఆలోచించాలన్నారు.

బీజేపీలో ఈటల రాజేందర్ అసంతృప్తితో ఉన్నారన్న రేవంత్

బీజేపీలో ఈటల రాజేందర్ అసంతృప్తితో ఉన్నారన్న రేవంత్

కేసీఆర్‌కు ఆది నుంచి అంబేద్కర్ మీద గౌరవం లేదని రేవంత్ అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజున కాకుండా అంబేద్కర్ పుట్టిన రోజు సచివాలయాన్ని ప్రారంభిస్తే గౌరవం ఉండేదన్నారు. ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరని అన్నారు. బీజేపీ ఐడియాలజీతో ఈ ముగ్గురుకి సంబంధం లేదని.. కేసీఆర్‌ను మాత్రమే వ్యతిరేకిస్తారని రేవంత్ చెప్పారు. బీజేపీలో కూడా కోవర్టులు ఉన్నారని ఈటల అన్నారంటే.. ఆయన ఏదో అసంతృప్తిగా ఉన్నట్లే కదా? అని ప్రశ్నించారు.

పొంగులేటితో భట్టి చర్చలు జరుపుతున్నారన్న రేవంత్

పొంగులేటితో భట్టి చర్చలు జరుపుతున్నారన్న రేవంత్

హుజూరాబాద్, మునుగోడులలో రెండు చోట్ల కూడా సందర్భానుసారమే బీజేపీకి ఓట్లు పడ్డాయన్నారు రేవంత్. మిగితా సందర్బాల్లో ఆ ఓట్లు కూడా పడేవి కావన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని, హైకమాండ్ ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పుడున్న వయో పరిమితి 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. 21 ఏళ్లకే కలెక్టర్ అయ్యేందుకు అవకాశం కల్పించినప్పుడు.. ఎమ్మెల్యే అయితే తప్పేముందని రేవంత్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ అనుకున్నదే ఈటల చేస్తున్నారన్న రేవంత్

కేసీఆర్ అనుకున్నదే ఈటల చేస్తున్నారన్న రేవంత్

కేసీఆర్ విష ప్రయోగంలో ఈటల కూడా పాత్రధారి అవుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజేందర్ కు ఇష్టంలేని పనులను కేసీఆర్ చేయిస్తున్నారని అన్నారు. ఈటల లెఫ్టిస్ట్.. కానీ, రైటిస్ట్ పార్టీలోకి పోయేలా చేశాడన్నారు. ఈటెలకు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఇష్టం లేదని.. కానీ హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టించారని అన్నారు. కేసీఆర్ అనుకున్నదే రాజేందర్‌తో చేపిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

గవర్నర్‌కు కేసీఆర్ క్షమాపణలంటూ రేవంత్ ఫైర్

గవర్నర్‌కు కేసీఆర్ క్షమాపణలంటూ రేవంత్ ఫైర్


కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిపబ్లిక్ డేను ప్రగతిభవన్, రాజ్‌భవన్‌కే పరిమితం చేశారని మండిపడ్డారు. గణతంత్ర వేడుకను వివాదాలకు వేదిక చేశారని ధ్వజమెత్తారు. గవర్నర్, సీఎం మధ్య విభేదాలుంటే మరో వేదికపై ప్రదర్శించాలి కానీ.. గణతంత్ర వేడుకను వేదిక చేసుకోవడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే గవర్నర్‌కు క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

English summary
Revanth Reddy slams CM KCR for republic day celebration issue: key comments on Etela Rajender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X