వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కు కరోనా పాజిటివ్ - పార్టీ నేతలకు సూచన..!!

|
Google Oneindia TeluguNews

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 'ఆజాదీకా గౌరవ్‌' యాత్రలో భాగంగా నియోజకవర్గాల్లో పార్టీ నేతల పాదయాత్రకు నిర్ణయించారు. రేవంత్ మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించ తల పెట్టిన పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది. అయితే శనివారం అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ లక్షణాలుగా అనుమానించిన రేవంత్ పరీక్ష చేయించుకున్నారు. దీనికి సంబంధించిన రిపోర్టు వచ్చే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. నివేదికలో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.

అందరూ పరీక్షలు చేయించుకోండి

అందరూ పరీక్షలు చేయించుకోండి


గత వారం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ రేవంత్ అటు ఢిల్లీలో...ఇటు మునుగోడు వ్యహారాల్లో హైదరాబాద్ గాంధీ భవన్ లో వరుస సమావేశాలకు హాజరయ్యారు. అయితే, ఆయనకు ఇప్పుడు తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావటంతో తనను కలిసిన వారందరూ పరీక్ష చేయించుకోవాలని రేవంత్ సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు రేవంత్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా.. ఫరూక్ అబ్దుల్లా కూడా కరోనా బారిన పడ్డారు.

సోషల్ మీడియా ద్వారా సందేశాలు


కరోనా దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. దీని బారిన సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్యులు పడుతున్నారు. ఢిల్లీ కేంద్రం కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణతో సహా తొమ్మది రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో తెలంగాణలో సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే, ఇప్పుడు రేవంత్ పార్టీ శ్రేణులకు తన సందేశాలను సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు.

మునుగోడులో రాజకీయ వేడి


తాజాగా కోమటిరెడ్డికి క్షమాపణలు.. అదే విధంగా మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు - కోదండరాం వంటి వారిని కలుపుకుపోదాం అంటూ ఆయన వీడియో సందేశం ద్వారా పార్టీ శ్రేణులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. స్వల్ప లక్షణాలతో పాజిటివ్ గా తేలినట్లుగా రేవంత్ వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల రేవంత్ ఐసోలేషన్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 20న టీఆర్ఎస్ బహిరంగ సభ.. 21 ప మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ సైతం ఏ విధంగా అక్కడ వ్యవహరిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

English summary
TPCC Chie Revanth Reddy tested Covid positive, he appealed those who came in contact with him to get them selves tested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X