వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని బహిర్గతం చేస్తా..! టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు విధానాలపై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు వ్యూత్మకంగా ఒకరి ఉనికి ఒకరు కాపాడుకునే విధంగా సహకరించుకుంటున్నాయని ఘాటుగా విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లలో 1000కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ అధ్యక్షులు కే. లక్ష్మణ్ ఆరోపించగా, సిబిఐ విచారణకు అదేశించండి నిజాయితీ నిరూపించుకుంటామని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారని అన్నారు. జరిగిన అవినీతి మీద కేంద్ర హోంశాఖ కు ఫిర్యాదు చేస్తామని, దర్యాప్తు జరిపించేందుకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి ఈశ్వర్, ప్రభాకర్ రావులు దుందుడుకుగా వ్యవహరిస్తుంటే లక్ష్మణ్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం..!కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ భూములు అమ్మి పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తాం..!

కేసీఆర్ పై విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీకి లేదు..! ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!!

కేసీఆర్ పై విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీకి లేదు..! ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..!!

టిఆర్ఎస్ తో బీజేపీ లాలూచీ ఏంటని, గల్లీలో ఫైట్ ఢిల్లీలో దోస్తీ నాటకాలు ఆపాలని, ప్రాజెక్టుల్లో అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ అన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుచ ను లొంగదీసుకోవడానికి బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని, నిజంగా శిక్షించాలి అనుకుంటే సీబీఐ విచారణ జరిపించాలని అన్నారు. కాంగ్రెస్ ఆరోపణలు తప్పైతే తమను శిక్షించాలని, విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ వ్యవహారాలను రేపు ఆధారాలు బహిర్గతం చేస్తానని, రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 2016 ఫిబ్రవరి 1న అప్పటి ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఇండియా బుల్స్ వదిలేసిన సబ్ క్రిటికల్ టెక్నాలజీస్ ను కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారని, దాని ద్వారా 2017 నాటికి భద్రాద్రి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారుప కాని 2012లోనే కేంద్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీని నిషేధించిందన్నారు. అన్ని రాష్ట్రాలు సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి అప్ గ్రేడ్ కావాలని కేంద్రం ఆదేశించిందని రేవంత్ చెప్పుకొచ్చారు.

విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి..! ఆధారాలు బహిర్గతం చేస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!

విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి..! ఆధారాలు బహిర్గతం చేస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!

అంతే కాకుండా గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్ట్ కోసం బిహెచ్ఈఎల్ కు ఇండియా బుల్స్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మిషనరీ కోసం ఒప్పందం కుదుర్చుకుందని, కానీ తర్వాత కేంద్ర నిర్ణయంతో దాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరించిందని తెలిపారు. ఆ కంపెనీ తిరస్కరించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన ఆరోపించారు. ఇండియా బుల్స్ ను గట్టేంకించడానికే కేంద్రం నిషేధించిన టెక్నాలజీని కొన్నారు. యాదాద్రి ప్రాజెక్టులో 32,000కోట్ల రూపాయల పనులను నామినేషన్ పద్దతిలో కాంట్రాక్ట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీహెచ్ఈఎల్ కు కాంట్రాక్ట్ ఇచ్చి దాన్నుంచి చంద్రశేఖర్ రావు తన బంధువులకు పనులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. వారు చంద్రశేఖర్ రావు కు కమీషన్లు ఇచ్చారని, వాటికి జెన్కో సీఎండీ డీ. ప్రభాకర్ రావు సంతకాలు చేశారని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..! వాస్తవాలు చెప్పేందుకు రెఢీ అంటున్న రేవంత్..!!

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..! వాస్తవాలు చెప్పేందుకు రెఢీ అంటున్న రేవంత్..!!

సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాల్సిన జెన్కో సీఎండీ పదవిలో డీ. ప్రభాకర్ రావు ను ఎందుకు నియమించారో చెప్పాలని రేవంత్యరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే బీహెచ్ఈఎల్ జార్ఖండ్ రాష్ట్రంలో 17 శాతం లెస్ తో ఓపెన్ బిడ్డింగ్ లో కాంట్రాక్ట్ దక్కించుకుందని, కానీ ఇక్కడ నామినేషన్ పద్దతిలో పనులు ఇవ్వడం వల్ల సుమారు 6000కోట్ల రూపాయాల నష్టం జరిగిందని అన్నారు. చంద్రశేఖర్ రావు చేసిన సహారా ఇండియా కుంభకోణం, ఈఎస్ఐ హాస్పిటల్ కుంభకోణం పై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బృందం ను పార్టీ నియమించిందని, సాగునీటి శాఖలో జరుగుతున్న అవినీతి పై ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క బృందం ను పార్టీ నియమించారని తెలిపారు. విద్యుత్ లో జరిగిన అవినీతి, భూ కుంభకోణం పై తనతో కమిటీ వేశారని, వీటిపై రాజకీయ, న్యాయ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..! డిమాండ్ చేస్తున్న విద్యుత్ సౌధ ఉద్యోగులు..!!

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..! డిమాండ్ చేస్తున్న విద్యుత్ సౌధ ఉద్యోగులు..!!

ఇదిలా ఉండగా విద్యుత్తు సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విద్యుత్తుసౌధ ఉద్యోగులు ధర్నా చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు ఈ సందర్భంగా డిమాండ్ చేేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తమ భవివష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని ఉద్యోగ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు రేవంత్ రెడ్డిని హెచ్చరించడం విశేషం.

English summary
Malkajgiri Congress MP Revanth Reddy once again burned down on the policies of Telangana cm Chandrasekhar Rao. In addition, the BJP and TRS parties in Telangana have been sharply criticized for cooperating with one another's presence. In the power purchase, Rs 1000 crore in corruption, BJP President K. Laxman said he had been accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X