వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రబెల్లిxరేవంత్ రెడ్డి, వద్దని బాబు!: తెలంగాణ సమస్యలు ఢిల్లీలో చెప్తా: ఏపీ సీఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డిల మధ్య శనివారం నాడు వాగ్వాదం జరిగింది. ఇది చంద్రబాబును అసహనానికి గురి చేసిందని తెలుస్తోంది.

శనివారం తెలుగుదేశం పార్టీ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కష్టపడితే పార్టీలో పదవులు అవే వస్తాయని, తాను 2007లో పార్టీలో చేరానని, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిని అయ్యానని చెప్పారు.

కష్టపడితే పార్టీలో పదవులు ఖాయమని, ఎప్పుడు వచ్చామని ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎర్రబెల్లి మాట్లాడుతూ... నియోజకవర్గాలలో బలోపేతం చేయాలని, పార్టీలో కలిసి కట్టుగా పని చేయాలని ఎర్రబెల్లి హితవు పలికినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు హితవు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలని, ఏ ఎన్నిక పెట్టినా రాష్ట్రంలో గెలుపు టిడిపిదే కావాలని చంద్రబాబు అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో పార్టీ శక్తిని నిరూపించాలన్నారు. విభజన తర్వాత ఏర్పడిన సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

తెలంగాణ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో ఏదో జరిగిందని తాను చెప్పడం లేదని, కానీ అందరు కలిసిమెలిసి పని చేయాలని, అప్పుడే పార్టీ ముందుకు వెళ్తుందని చంద్రబాబు చెప్పారు. విభేదాలు మాని ముందుకు సాగాలన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

తెలంగాణలోని మంత్రులంతా అటూ ఇటూ కానివారేనని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవితతో చెప్పారని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ అన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

పటాన్‌చెరులో జరిగిన టీడీపీ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రస్తుత కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌లో 18మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

ఎమ్మెల్యేలు, మంత్రులు చెబితే ఏ ఉద్యోగీ వినే పరిస్థితి కనిపించడం లేదని, ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగితో పని చేయించుకునేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఓ మంత్రికి చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు. కరవు సహాయక చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ సర్కారు తీవ్రంగా విఫలమైందన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

వరంగల్ లోకసభకు నామినేషన్లు వేసిన అనంతరం పరిస్థితి తమకు అనుకూలంగా మారిందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

అయితే బీజేపీ అభ్యర్థని పోటీలో పెట్టినందుకు టీడీపీ కార్యకర్తలు నిరాశ చెందారని ఎర్రబెల్లి అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగుదేశం

తెలుగుదేశం

వరంగల్ స్థానంలో గెలుపోటముల బాధ్యత తనదేనన్న ఆయన, ఉప ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రచారానికి వస్తే కేడర్‌‍లో ఉత్సాహం వస్తుందన్నారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

ఈ ఎన్నికలో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు కసితో ఉన్నారని, అటు ప్రస్తుత తాజా పరిణామాలు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయని అభిప్రాయపడ్డారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

గిట్టుబాటు ధర రాక, తన ఆక్రోశాన్ని బయట పెట్టిన ఓ రైతును సైకోగా అభివర్ణించడం టీఆర్ఎస్ నేతలకు సిగ్గుచేటని ఎర్రబెల్లి నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

కేసీఆర్ సర్కారు రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఓ రైతును సైకో అనడం ఆయన స్థాయికి సరికాదని హితవు పలికారు.

తెలుగుదేశం

తెలుగుదేశం

రైతుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఎర్రబెల్లి అన్నారు.

ప్రభుత్వంపై నిప్పులు

తెలంగాణలోని మంత్రులంతా అటూ ఇటూ కానివారేనని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవితతో చెప్పారని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ అన్నారు. పటాన్‌చెరులో జరిగిన టీడీపీ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రస్తుత కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌లో 18మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా, ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు చెబితే ఏ ఉద్యోగీ వినే పరిస్థితి కనిపించడం లేదని, ఓ జీహెచ్ఎంసీ ఉద్యోగితో పని చేయించుకునేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఓ మంత్రికి చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు. కరవు సహాయక చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ సర్కారు తీవ్రంగా విఫలమైందన్నారు.

English summary
Revanth Reddy versus Errabelli in TDP meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X