వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ కవిత: మాటల యుద్ధం; ఎవ్వరూ తగ్గేదేలే!!

|
Google Oneindia TeluguNews

నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వాడివేడి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయిందని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది కేసీఆర్ వల్లే అంటూ టిఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ ను గుర్తు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగింది.

దీక్షా దివస్ ను టార్గెట్ చేస్తూ కవితకు కాంగ్రెస్ ట్వీట్ .. కవిత కౌంటర్


తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ అఫీషియల్ ఖాతాలో ఎమ్మెల్సీ కవిత ను టార్గెట్ చేసి ఓ ట్వీట్ చేశారు. ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! కవిత అంటూ ట్వీట్ చేసిన కాంగ్రెస్ పార్టీ దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం అంటూ అసహనం వ్యక్తం చేసింది. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కాడని, చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక దీనికి కౌంటర్ గా సమాధానం ఇచ్చిన కవిత తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ,తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని టార్గెట్ చేశారు. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని పేర్కొన్నారు.

ప్రజలు తిరస్కరించినా బుద్ధి రావటం లేదని కవిత ట్వీట్

ప్రజా పోరాటాలను కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకుందని, దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదని కవిత మండిపడ్డారు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి,తెలంగాణ రాష్ట్రం తెచ్చారని ఆమె వెల్లడించారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మ బలిదానాలు కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యలని కవిత మండిపడ్డారు. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీపార్టీ పైనే ఎమ్మెల్సీ కి పోటీ చేసి గెలిచా అంటూ కవిత రాహుల్ గాంధీ పై తీవ్ర విమర్శలు చేశారు.

వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే.. మీ పదవులా: కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్


ఇక ఎమ్మెల్సీ కవిత చేసిన కాంగ్రెస్ పార్టీ పై అనుచిత వ్యాఖ్యల ట్వీట్ లకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే... బతుకమ్మ ఆడినందుకే...బోనం కుండలు ఎత్తినందుకే ...మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!? అని ప్రశ్నించారు. అమరవీరుల బలిదానాలకు 'చంద్ర'గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. అందుకే త్యాగాలు చేసిందెవరు భోగాలు అనుభవిస్తున్నది ఎవరని యావత్ తెలంగాణ రాష్ట్రం ఘోషిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అధికార మదంతో మూసుకుపోయిన మీ కళ్ళకు చెవులకు అవి కనపడవు, వినబడవు అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ ట్వీట్ పై కవిత అసహనం... ఇది మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం

రేవంత్ ట్వీట్ పై కవిత అసహనం... ఇది మీకు మహిళల పట్ల ఉన్న గౌరవం


ఇక రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ను టార్గెట్ చేసిన కవిత చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారుల పై " తుపాకీ "ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం , బోనం మరియు బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ లతో బతుకమ్మ ఎత్తించినా, బతుకమ్మ పేరు ఉచ్చరించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతే అని కవిత స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడిలో మేము ఆడబిడ్డలము ముందున్నాము !!మీరు ఎక్కడున్నారు? మీ పార్టీ ఎక్కడుంది? అంటూ ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు దీటుగా జవాబిచ్చారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దీక్షాదివస్ నాడు ఎమ్మెల్సీ కవిత వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి.

తెలంగాణాలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు: ఇప్పుడు కూడా గ్రహాలన్నీ ఒకేవరుసలోకి రావాలేమో: సుప్రీం ధర్మాసనం!!తెలంగాణాలో జ్యోతిష్యం ప్రకారమే ఎన్నికలు: ఇప్పుడు కూడా గ్రహాలన్నీ ఒకేవరుసలోకి రావాలేమో: సుప్రీం ధర్మాసనం!!

English summary
The war of words between Revanth Reddy and MLC Kavitha continues. Kavitha's tweet on Deeksha Divas was targeted by the Congress party and Kavita countered Congress. With this, Revanth Reddy criticized Kavitha, and she made a reverse attack on Revanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X