వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతొద్దు!: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నో, మోత్కుపల్లి గుట్టు విప్పేనా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలపై ఏపీ టిడిపి నేతలు స్పందిస్తున్నారు. రేవంత్ పైన విరుచుకుపడుతున్నారు.టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చ

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలపై ఏపీ టిడిపి నేతలు స్పందిస్తున్నారు. రేవంత్ పైన విరుచుకుపడుతున్నారు.

ఆయనవల్లే 12మంది: మోత్కుపల్లి, ఎందుకొస్తున్నానంటే, నాతో వీళ్లూ: కాంగ్రెస్ నేతలతో రేవంత్ఆయనవల్లే 12మంది: మోత్కుపల్లి, ఎందుకొస్తున్నానంటే, నాతో వీళ్లూ: కాంగ్రెస్ నేతలతో రేవంత్

టిడిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న రేవంత్ రెడ్డి తనతో పాటు వచ్చే కీలక నేతలకు టిక్కెట్లు ఇప్పించాలనుకుంటున్నారు. ఆ సంఖ్య 15 నుంచి 20కి పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

మోడీ మొండిచేయి, చంద్రబాబుకు మోత్కుపల్లి ఒత్తిడి: రేవంత్ రెడ్డికి ఎసరుమోడీ మొండిచేయి, చంద్రబాబుకు మోత్కుపల్లి ఒత్తిడి: రేవంత్ రెడ్డికి ఎసరు

11 మందికి టిక్కెట్ ఇవ్వాలని రేవంత్ డిమాండ్

11 మందికి టిక్కెట్ ఇవ్వాలని రేవంత్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీలో చేరితే తనతో పాటు వచ్చే 11 మందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి షరతు పెట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

కాంగ్రెస్ అందుకు సిద్ధం

కాంగ్రెస్ అందుకు సిద్ధం

కాంగ్రెస్ పార్టీ మాత్రం రేవంత్ రెడ్డి కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. దాదాపు ఆరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని రేవంత్‌కు చెప్పిందని సమాచారం. మరోవైపు, రేవంత్ పైన తెలంగాణ టిడిపి నేతలతో పాటు ఏపీ టిడిపి నేతలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీ టిడిపి నేత, మంత్రి నారా లోకేష్ హైదరాబాదుకు వచ్చారు. వ్యక్తిగత పనులతో పాటు రేవంత్ వ్యవహారంపై ఆయన చర్చించనున్నారు.

టిలో కాంగ్రెస్‍‌కు ఒక్క సీటు రాదు మరి రేవంత్ ఎందుకు

టిలో కాంగ్రెస్‍‌కు ఒక్క సీటు రాదు మరి రేవంత్ ఎందుకు


రేవంత్ రెడ్డి పార్టీ మారినా ఎలాంటి నష్టం లేదని ఎంపీ తోట నర్సింహం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యవహారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చూసుకుంటారని తెలిపారు. టిడిపి క్రమశిక్షణ కలిగిన పార్టీ అన్నారు. ఏపీ టిడిపి నేతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఏపీలోనైనా కాంగ్రెస్ పార్టీకి రెండుమూడు సీట్లు వస్తాయోమోనని, కానీ తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ ఎందుకు వెళ్తున్నారో అన్నారు.

మోత్కుపల్లి.. రేవంత్ గుట్టు విప్పేనా?

మోత్కుపల్లి.. రేవంత్ గుట్టు విప్పేనా?


రేవంత్ రెడ్డి పైన టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ మాటలు సరికాదన్నారు. రేవంత్ ఎక్కడెక్కడి నుంచి ఏం లబ్ధి పొందారో తమకు తెలుసునన్నారు. ఆయన ఏపీలో ఎన్ని కమీషన్లు తీసుకున్నారో తెలుసునని ఆరోపించారు.

English summary
Revanth Reddy wants the moon in Congress, Lokesh firefights
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X