హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిడ్డా! రా, ముందే కేసీఆర్ ఆత్మహత్య, నా ఫ్యామిలీతోదుర్మార్గంగా: విడుదలయ్యాక రేవంత్ ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని తన నివాసం నుంచి అభిమానులను, మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఆయనను మంగళవారం వేకువజామున అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేశారు. పోలీసులు ఆయనను కొడంగల్ తరలించారు. అక్కడ మాట్లాడారు.

కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2009లో పాలమూరు లోకసభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గెలుపొందడంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. తన నియోజకవర్గం ప్రజలు కీలక పాత్ర పోషించారని అన్నారు. గెలిచిన తర్వాత ఎప్పుడైనా పాలమూరును పట్టించుకున్నారా అన్నారు.

రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్, కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా:జైపాల్రేవంత్‌రెడ్డి అరెస్ట్‌పై హైకోర్టులో పిటిషన్, కేసీఆర్! నీ కూతురు బెడ్రూంలోకి వెళ్తే ఊరుకుంటావా:జైపాల్

కొండగల్‌పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్

కొండగల్‌పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్

అరాచకాలు, పోలీసు నిర్బంధాలు తమ గెలుపును ఆపలేవని రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని చెప్పారు. ఇప్పుడు అరాచకాలు సృష్టించి కొడంగల్‌లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారన్నారు. ప్రజల అభిమానాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కానీ అది కుదరదని చెప్పారు.

 అర్ధరాత్రి తలుపులు విరగ్గొట్టి అరెస్ట్

అర్ధరాత్రి తలుపులు విరగ్గొట్టి అరెస్ట్

తాను సోమవారం రాత్రి ప్రచారంలో అలసిపోయి నిద్రపోయానని, మంగళవారం వేకువజామున పోలీసులు తలుపులు బాది, విరగ్గొట్టి, తన బెడ్రూంలోకి వచ్చి కనికరం లేకుండా, కనీసం ప్రజాప్రతినిధిగా పని చేశానని కూడా గుర్తించకుండా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని కూడా ఆలోచించకుండా తీసుకెళ్లారని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న తనపై, తన కుటుంబంపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పారు. మహిళలపై మగ పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు.

రూ.150 కోట్లతో కొనుగోలు చేయాలని ప్రయత్నం

రూ.150 కోట్లతో కొనుగోలు చేయాలని ప్రయత్నం

రూ.150 కోట్ల నగదుతో కొడంగల్ ప్రజలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని చెప్పారు. రూ.200 కోట్లతో ప్రజలను కొనాలని చూస్తున్నారన్నారు. పోలీసుల వాహనంలోనే నగదు సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. నాడు కోదండరాంను ఇలాగే అరెస్టు చేశారని, అప్పుడు అందరూ కోదండకు అండగా నిలబడి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

కేసీఆర్ ముందే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి

కేసీఆర్ ముందే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి

ఒక్క కొడంగల్ నియోజకవర్గంలో గెలిచేందుకు ఇలా దాడులు చేస్తారా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నియంతల పాలనలో కూడా ఇంత అరాచకం జరగలేని చెప్పారు. కేసీఆర్‌కు అయిదేళ్లు పాలించమని చెబితే ముందస్తు ఎన్నికలకు వచ్చి, ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ ముందస్తులతో కేసీఆర్ ముందే ఆత్మహత్య (రాజకీయంగా) చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. కేసీఆర్ ముందస్తుగానే ఆత్మహత్య చేసుకునేందుకు ఈ అరాచకాలు దారులు అయ్యాయని చెప్పారు.

ముగ్గురు కలిసి రండి.. బిడ్డా

ముగ్గురు కలిసి రండి.. బిడ్డా

కొడంగల్ నియోజకవర్గానికి మొదట నీ అల్లుడు హరీష్ రావు, ఆ తర్వాత నీ కొడుకు కేటీఆర్, ఇప్పుడు నీవు (కేసీఆర్) వచ్చారని, కానీ తనను ఓడించలేరని రేవంత్ అన్నారు. కేసీఆర్‌కు నేను ఒక్కటే చెప్పదల్చుకున్నానని, మీరు ముగ్గురు కలిసి రండి.. మీ ముఠాలతో కలిసి రండి.. అంబేడ్కర్ విగ్రహం వద్ద గిరిగీసుకొని కూర్చుందాం.. పోలీసుల పహారా మధ్య ఇక్కడ పర్యటించావు.. నేను చెబుతున్న బిడ్డా (కేసీఆర్) ని విమర్శించారు. కేసీఆర్‌ను చూస్తుంటే చార్లెస్ శోభరాజు.. బిల్లా రంగాలను కలిసినట్లుగా ఉందన్నారు.

ఇది 2 లక్షల మందిపై జరిగిన దాడి

ఇది 2 లక్షల మందిపై జరిగిన దాడి

తనపై జరిగిన దాడి ఒక్కడి మీద జరిగిన దాడి కాదని, కొడంగల్ నియోజకవర్గంలోని 2 లక్షల మంది పైన జరిగిన దాడి అని రేవంత్ అన్నారు. ఈ దాడిని తిప్పికొట్టేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొడంగల్ ప్రజలు మీరు చేసే అరాచకాలను చూస్తున్నారని చెప్పారు. ఇంటింటికి తిరిగి ప్రజలను ప్రలోభాలకు గురి చేయాలని, కొనుగోలు చేయాలని, పోలీసుల ముసుగులే ప్రయత్నాలు చేశారని, ఓటుకు రూ.5వేల చొప్పున పంపకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హరీష్ రావు పంపకాల్లో మునిగితేలారని చెప్పారు. పంపకాల్లో తేడా వస్తే ఆయన దృష్టి సారించారన్నారు.

 అరాచకం జరగవచ్చునని సమాచారం

అరాచకం జరగవచ్చునని సమాచారం

రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారి రజత్ కుమార్.. డీజీపీని ఎందుకు వివరణ అడగలేదని చెప్పారు. మీరు విధులు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ వారు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తనను ఇప్పుడు విడుదల చేశారని చెప్పారు. పోలీసులు చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ 24 గంటల్లో ఏ అరాచకమైన జరగవచ్చునని రేవంత్ హెచ్చరించారు. తెరాస నేతలు ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని తనకు సమాచారం అందుతోందని చెప్పారు.

English summary
Telangana congress working president Revanth Reddy with media and followers after releasing from police on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X