• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ పోలీసుల పేర్లు డైరీలో రాసుకుంటాం-వాళ్లు ప్రభుత్వానికి అల్లుళ్లా-తెలంగాణను బిహార్‌లా మారుస్తున్నారు : రేవంత్

|

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసుల తీరును తప్పు పట్టారు.తన ఇంటిపై దాడి చేసినవాళ్లను వదిలేసి... దాడిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడమేంటని పోలీసులను ప్రశ్నించారు. కొంతమంది గూండాలు టీఆర్ఎస్ కార్యకర్తల ముసుగులో తన ఇంటిపై దాడికి యత్నించారని ఆరోపించారు. అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలను అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేశారని అన్నారు.టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని ఎలా తీసుకొస్తారని నిలదీశారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆ పోలీస్ స్టేషన్‌కు,ఈ పోలీస్ స్టేషన్‌కు తిప్పుతున్నట్లు తెలిసిందన్నారు.ఒకవేళ వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించారు.బుధవారం(సెప్టెంబర్ 22) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి తన ఇంటిపై దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేటీఆర్ నా వెంట్రుకతో సమానం-అలా అయితేనే అన్నీ బయటపడుతాయి-నిప్పు లేనిదే పొగ రాదు:'డ్రగ్స్' ఇష్యూపై రేవంత్ కేటీఆర్ నా వెంట్రుకతో సమానం-అలా అయితేనే అన్నీ బయటపడుతాయి-నిప్పు లేనిదే పొగ రాదు:'డ్రగ్స్' ఇష్యూపై రేవంత్

కేసీఆర్ రాష్ట్రాన్ని బిహార్‌లా మారుస్తున్నాడు...

కేసీఆర్ రాష్ట్రాన్ని బిహార్‌లా మారుస్తున్నాడు...

కేసీఆర్ తెలంగాణను బిహార్ రాష్ట్రంగా మారుస్తున్నాడని... బిహార్ నుంచి వచ్చిన అధికారులను కీలక పదవుల్లో పెట్టి పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నాడని ఆరోపించారు.
పోలీసుల కళ్ల ముందే తన ఇంటిపై దాడులు చేసినవాళ్లు ప్రభుత్వానికి అల్లుళ్లలా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు.తాను డీజీపీతో మాట్లాడానని... ఇప్పటికైనా తన ఇంటిపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అన్యాయంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో బిహారీ తరహా పాలన చెల్లదన్నారు.బిహార్‌లో గతంలో ఉన్న అరాచక పాలనను ఇక్కడ రుచి చూపించాలనుకుంటే ఒప్పుకునేది లేదన్నారు.నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే పోలీసుల పేర్లను డైరీలో రాసుకుంటామని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలీసుల కళ్లముందే దాడులు...

దాడి చేసినవాళ్లను వదిలేసి... అడ్డుకున్నవాళ్లపై కేసులేంటని ప్రశ్నిస్తే... మీరూ ఫిర్యాదు ఇవ్వండని చెబుతున్నారని... పోలీసుల కళ్ల ముందే దాడి జరిగితే కేసు పెట్టి విచారణ చేయాల్సిన బాధ్యత వారికి లేదా అని ప్రశ్నించారు. గతంలో కొంతమంది వ్యక్తులు తన వాహనాన్ని అనుసరించి ఇబ్బంది పెడితే... వాళ్ల ఫోటోలు,బండి ఫోటోలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. కానీ ఇప్పటివరకూ దానిపై కేసు నమోదవలేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కేసు పెట్టలేదని... విచారణ జరపలేదని అన్నారు. ఇకనైనా దాడి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి... దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనపై దాడులు చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

వారిని విడుదల చేయాలన్న దాసోజు శ్రవణ్...

వారిని విడుదల చేయాలన్న దాసోజు శ్రవణ్...

అంతకుముందు,కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతల అరెస్టుకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రేవంత్ ఇంటిపై దాడికి వచ్చినవారిని అడ్డుకున్నందుకు అరెస్టులు చేయడం అక్రమమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని... ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని అన్నారు.

రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్తత...

రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్తత...

హైదరాబాద్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.నిన్న కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ ఇంటి వద్ద ఆయన దిష్ఠి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు.ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.కర్రలతో రేవంత్ అనుచరులు టీఆర్ఎస్ శ్రేణులను తరిమికొట్టారు. ఈ సందర్భంగా ఇరువురు రాళ్ల దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

  రేవంత్ ఇంటిపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు!!
  కేటీఆర్-రేవంత్ డ్రగ్స్ వార్...

  కేటీఆర్-రేవంత్ డ్రగ్స్ వార్...

  మంత్రి కేటీఆర్,టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య 'డ్రగ్స్'వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైట్ ఛాలెంజ్‌కు రేవంత్ సవాల్ విసరగా కేటీఆర్ దానికి కౌంటర్ ఇచ్చారు. చర్లపల్లి బ్యాచ్‌తో కలిసి తాను టెస్టులకు రానని... రాహుల్ వస్తే ఇద్దరం కలిసి ఎయిమ్స్‌లో టెస్టులు చేయించుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.దీనిపై స్పందించిన రేవంత్... కేటీఆర్ నా వెంట్రుకతో సమానమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వినియోగంపై వైట్ ఛాలెంజ్ విసిరితే మంత్రి కేటీఆర్ ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. సవాల్ స్వీకరిస్తాడనుకుంటే... తనపై తిట్ల దండకం అందుకున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కూడా తనతో వస్తే ఢిల్లీ ఎయిమ్స్‌లో కలిసి టెస్టులు చేయించుకుంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. రాహుల్ కూడా అందుకు సిద్ధపడితే... అప్పుడు ఇవాంకా ట్రంప్ రావాలంటాడేమోనని ఎద్దేవా చేశారు.కేటీఆర్‌ను తాను సూటిగా ఒకటే అడుగుతున్నానని... వైట్ ఛాలెంజ్‌తో రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉందామని పేర్కొన్నారు.

  'నేను కేటీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. నేనేమీ ఆయన ఆస్తులు,ఫాంహౌస్‌లు అడగలేదు.తెలంగాణ యువకులకు రాష్ట్ర ప్రజాప్రతినిధులుగా ఆదర్శంగా ఉందామని చెబుతున్నా.ఇందుకోసం మన రక్తం,వెంట్రుకల నమూనాలను డ్రగ్స్ పరీక్షల కోసం ఇద్దామంటున్నా. ఇటీవలే మీడియాతో చిట్‌చాట్‌లో... డ్రగ్స్‌తో నాకే సంబంధం... నా రక్తమిస్తా... నా వెంట్రుకలిస్తా... నా నిజాయితీని నిరూపించుకుంటానని కేటీఆరే అన్నారు. కేటీఆర్ ఇంత ఆదర్శంగా ఉన్నప్పుడు.. నేను వెనక్కి తగ్గితే యువకులకు అనుమానం వస్తది కాబట్టి... నేను వైట్ ఛాలెంజ్ విసిరాను. గన్‌పార్క్ వద్దకు వస్తే ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని ప్రజలకు ఆదర్శంగా ఉందామని అన్నాను.కేటీఆర్‌తో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి స్పోర్టివ్‌గా ఛాలెంజ్ విసిరాను.కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఇక్కడికి రాగా కేటీఆర్ ఎందుకు రాలేదో తెలంగాణ యువతే ఆలోచించుకోవాలి.' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ కోర్టును ఆశ్రయించగా... మరోసారి మంత్రి పేరును డ్రగ్స్‌తో ముడిపెట్టి మాట్లాడవద్దని న్యాయస్థానం రేవంత్‌కు ఇంజెక్షన్ ఆర్డర్ ఇష్యూ చేసింది.

  English summary
  TPCC chief Rewanth Reddy lashed out the Jubilee Hills police for not arresting the attackers,who tried to attack his house yesterday. He demanded to release the Congress workers who were arrested by police.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X