వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 మందిపై డిసెంబర్ 20లోగా తేల్చకుంటే: రేవంత్ డెడ్‌లైన్, నన్ను శిక్షించండి: కేటీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత అధికార తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన డిసెంబర్ 20లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ టిడిపి యువనేత రేవంత్ రెడ్డి గురువారం విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన శాసన సభాపతి మధుసూదనా చారికి లేఖ రాశారు. తాము ఇచ్చిన పిటిషన్‌లు ఇంకా పెండింగులో ఉన్నాయని గుర్తు చేశారు. హైకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినా సమాధానం లేదన్నారు. గడువులోగా నిర్ణయం తీసుకోకుంటే మరోసారి కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

revanth reddy

నన్ను శిక్షించొచ్చు అన్న కేటీఆర్

సిరిసిల్ల మండలం మండేపల్లి గ్రామంలో మంత్రులు కేటీ రామారావు, నాయిని నర్సింహా రెడ్డి పర్యటించారు. ఐటీఐ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఆదర్శ పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

కేసీఆర్‌కు ప్రధాని మోడీ పిలుపుకేసీఆర్‌కు ప్రధాని మోడీ పిలుపు

త్వరలో వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు విడుదల చేశామన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అయిదేళ్లలో సిరిసిల్ల రూపురేఖలు మార్చక పోతే శిక్షించే అధికారం ఇక్కడి ప్రజలకు ఉందన్నారు.

నిజామాబాద్ జిల్లాలో జూపల్లి

నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలం రామన్నపేటలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కప్పలవాగు వంతెన, చెక్ డ్యాం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడారు.

ప్రతీ ఇంట్లో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ అందజేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరు అందజేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు.

English summary
Revanth Reddy writes letter to Speaker over defections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X