వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్నాళ్లు మీకోసం..ఇప్పుడు నా కోసం : రెండేళ్లు అంతే : రేవంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఫైర్ బ్రాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిత్యం త‌న మాట‌ల తూటాల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌ను ఇబ్బంది పెట్టే రేవంత్ ఊహించ‌ని నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. రేవంత్ చేసే ప్ర‌సంగాల‌కు..కౌంట‌ర్ల‌కు అభిమానుల నుండి మంచి స్పంద‌న ఉండేది. అటువంటి రేవంత్ తీసుకున్న తాజా నిర్ణ‌యం తో ఇప్పుడు అభిమానులు నిరాశ ప‌డుతున్నారు..

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైనా..టిఆర్‌య‌స్ ప్ర‌భుత్వం పైనా ఎప్పుడూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే రేవంత్ రెడ్డి సంచ‌ల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ తీసు కున్న ఈ నిర్ణ‌యం తో ఆయ‌న అభిమానులు..కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఒకింత షాక్ కు గుర‌య్యారు. తెలంగాణ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

కేసీఆర్ కు కొన్ని సూచ‌న‌లు

కేసీఆర్ కు కొన్ని సూచ‌న‌లు

ఓటమి అనంతరం ఒక్క సారి మాత్ర‌మే రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఆ సంద‌ర్భంలోనూ కేసీఆర్ కు కొన్ని సూచ‌న‌లు చేసారు. ఆ త‌రువాత ఇంత వరకూ మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. తెలంగాణ సీఎం మొదలు కుని పీఎం వరకూ అందరిపైనా తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించే రేవంత్ ఓడిపోవడంతో కాంగ్రెస్‌ లో గట్టిగా మాట్లాడే.. కౌంటర్ల వర్షం కురిపించే నేత‌లు క‌రువ‌య్యారు.

రెండేళ్లు అంతే..నా కోసం..

రెండేళ్లు అంతే..నా కోసం..

ఇక‌, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా..రేవంత్ త‌న కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. తాను రెండేళ్ల వరకు మీడియాతో మాట్లాడ నని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు మీకోసం.. ఇప్పుడు నాకోసం మానేస్తున్నా అంటూ రేవంత్ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించా రు. రేవంత్ తాజాగా తీసుకున్న నిర్ణయం అటు కాంగ్రెస్ అధిష్టానం.. ఇటు ఆయన అనుచరులు, అభిమానులు అసం తృప్తికి లోనైనట్లు క‌నిపిస్తోంది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం తో తెలంగాణ లో అధికార పార్టీ పై ప్ర‌తిప‌క్షం నుండి విమ‌ర్శ‌లు చేసే గ‌ట్టి వాయిస్ ఉన్న నేతలు క‌రువైన‌ట్లే. మ‌రి..రేవంత్ నిర్ణ‌యం పై కాంగ్రెస్ నేత‌లు ఎలా స్పందిస్తారో .. అభిమానులు ఏ ర‌కంగా రేవంత్ పై ఒత్తిడి పెంచుతారో చూడాలి.

English summary
Telangana Congress Working President Revanth Reddy anounced dey decision. Revanth would not speak to media for two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X