• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడో వేవ్ ముంచుకొస్తోంది.!పిల్లల క్షేమం కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ప్రభుత్వానికి రేవంత్ సూచన.!

|

హైదరాబాద్ : దేశంలో కారోనా మూడో వేవ్ చిన్నారులపై త్రీవ ప్రభావం చూపనుందనే వార్తలు తారాస్థాయిలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య సదుపాయాలు మెరుగు పరుచుకోవడానికి సిద్ధంగా ఉండాలనే సంకేతాలు కూడా వెలుపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం ఉండాలని సూచిస్తున్నారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. అందులో భాగంగా మూడో దశను ఎదుర్కొనేందుకు అవరసమైన మందులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. నేటి చిన్నారులే రేపటి దేశ భవిష్యత్తు కబట్టి వారి ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి.

మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుంది.. అప్రమత్తంగా ఉండాలని టీ సర్కార్ కు సూచించిన రేవంత్

మూడో వేవ్ పిల్లలపై ప్రభావం చూపనుంది.. అప్రమత్తంగా ఉండాలని టీ సర్కార్ కు సూచించిన రేవంత్

కరోనో మూడవ దశ పిల్లలపై తీవ్ర ప్రభావితం చూపనుందని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యం కోసం ముందస్తు ప్రణాళికలతో ప్రబుత్వ యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో పిల్లల తల్లిదండ్రులకు తప్పకుండా టీకాలు వేయించాలని, పిల్లల మందుల ఉత్పత్తిని పెంచాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నర్సింగ్ సిబ్బందిని పెంచడం మరియు శిక్షణ ఇవ్వడం ఇప్పుడు చాలా అవసరమని, పిల్లల వైద్యానికి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు మెరుగుపరచాలన్నారు రేవంత్ రెడ్డి.

అన్ని విధాలా సిద్ధంగా ఉందాం.. భవిష్యత్ తరాలను రక్షించుకుందామన్న మల్కాజిగిరి ఎంపీ

అన్ని విధాలా సిద్ధంగా ఉందాం.. భవిష్యత్ తరాలను రక్షించుకుందామన్న మల్కాజిగిరి ఎంపీ

మన భవిష్యత్ తరాలను రక్షించుకోవాలంటే కొన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకోకతప్పదన్నారు రేవంత్ రెడ్డి. కరోనో మూడో వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, వైద్య నిపుణులు, శాస్త్ర వేత్తలు ఇప్పటికే ఈ విషయంలో హెచ్చరిస్తున్నారని, ఇప్పటి నుంచే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం నాడు ఈ విషయమై ఆయన ఒక ట్వీట్ చేశారు. దేశంలో మూడో కరోనో వేవ్ విషయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలో పిల్లల తల్లి తండ్రులకు వెంటనే కరోనో వాక్సిన్స్ టీకాలు వేయించాలని సూచించారు.

పిల్లల మందుల ఉత్పత్తులను పెంచాలి.. వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్న రేవంత్..

పిల్లల మందుల ఉత్పత్తులను పెంచాలి.. వైద్య సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్న రేవంత్..

పిల్లల వ్యాధులకు సంబంధించిన మందుల ఉత్పత్తులను గణనీయంగా పెంచి అన్ని రకాల మందుల కొరత లేకుండా చూడాలని ఆయన సూచించారు. అలాగే దేశంలో వైద్య సిబ్బందిని సరిపోయేంతగా పెంచాలని, నర్సింగ్ సిబ్బందిని పెంచి వారికి సరైన శిక్షణ, నైపుణ్యం ఇవ్వాలని ఇది ఈ సమయంలో అత్యంత కీలకమైన విషయమని అన్నారు. మూడో వేవ్ పిల్లల మీద ప్రభావం చూపుతుందని భయాందోళన ఉన్న నేపత్యంలో అన్ని రకాలుగా ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలను రక్షించుకోవడానికి ఇది చాలా ముఖ్యమైందని రేవంత్ రెడ్డి అన్నారు.

నేటి చిన్నారులే రేపటి దేశ భవిత.. కాపాడుకోవాల్సిన బాద్యత ఉందన్న ఎంపీ రేవంత్ రెడ్డి..

నేటి చిన్నారులే రేపటి దేశ భవిత.. కాపాడుకోవాల్సిన బాద్యత ఉందన్న ఎంపీ రేవంత్ రెడ్డి..

మొదటి దశ నుండి తగిన గుణపాఠాలు నేర్చుకోకపోడంతో రెండవ దశ ఇంత తీవ్రంగా పరిణమించిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. మొదటి దశ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించయని అందుకు ఇప్పుడు అనేక మంది బలవుతున్నారని మండిపడ్డారు. రెండవ దశ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసినప్పుడే మందులను, ఆసుత్రుల్లో బెడ్ల సౌకర్యాన్ని, ఆక్సీజన్ సిలిండర్లను, రెమ్డిసివిర్ ఇంజక్షన్లను వీలైనంత ఎక్కువ మోతాదులో నిలువ చేసుకుని ఉండి ఉంటే ఇంతమంది చనిపోయిఉండి ఉండేవారు కాదన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రేపు రాబోయే మూడవ దశను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

English summary
News is circulating that the Corona Third Wave will have a triple effect on children in the country.Malkajgiri MP Revanth Reddy suggested that the state government should be alert in such a moment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X