వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఐక్యం కావాలి, ఆ సిద్దాంతం కాలం చెల్లింది;, 'టిడిపి విలీనాన్ని ఆహ్వనిస్తాం'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టిడిపి పుట్టిందనే సిద్దాంతానికి కాలం చెల్లిందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో టిడిపి టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు చేసిన ప్రతిపాదనను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్వాగతించారు. మరో వైపు తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తోందని ఏపీకి చెందిన టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ అభిప్రాయపడ్డారు.

మోత్కుపల్లికి రమణ కౌంటర్: బాలకృష్ణ రియాక్షన్ ఇదిమోత్కుపల్లికి రమణ కౌంటర్: బాలకృష్ణ రియాక్షన్ ఇది

ఎన్టీఆర్ 22వ, వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర తీస్తాయా అనే చర్చ ప్రారంభమైంది.

టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనంటిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, ఇంత కంటే అవమానమా:బాబుపై మోత్కుపల్లి సంచలనం

టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవని తేచ్చి చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు రమణ ప్రకటించారు.

 కాంగ్రెస్ వ్యతిరేక సిద్దాంతానికి కాలం చెల్లింది

కాంగ్రెస్ వ్యతిరేక సిద్దాంతానికి కాలం చెల్లింది

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టిడిపి ఆవిర్భవించిందనే సిద్దాంతానికి కాలం చెల్లిందని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని రేవంత్ రెడ్డి సూచించారు.

 టిఆర్ఎస్‌లో విలీనం సరికాదు

టిఆర్ఎస్‌లో విలీనం సరికాదు

టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖను టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు చేసిన సూచన సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టిడిపికి బీసీలు, ఎస్‌సీలు అండగా ఉన్నారని ఆయన చెప్పారు. అయితే కెసిఆర్ ఆ వర్గాలను అణగదొక్కేందుకు ప్రయత్నించారని రేవంత్ అభిప్రాయపడ్డారు. నాయకులు టిఆర్ఎస్‌లో చేరినా టిడిపి క్షేత్రస్థాయిలో ఉన్న బీసీ, ఎస్‌సీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ సూచించారు. వారంతా కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. టిడిపిని బలహీనపర్చిన టిఆర్ఎస్‌లో విలీనం సరైంది కాదని రేవంత్ అభిప్రాయపడ్డారు.

అక్కడ జగన్‌కు, ఇక్కడ కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఐక్యం కావాలి

అక్కడ జగన్‌కు, ఇక్కడ కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఐక్యం కావాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్‌కు వ్యతిరేకంగా, తెలంగాణలో కెసిఆర్ కు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు నేతలు ఎణ్నికల ముందు టిడిపిలో చేరారని, తద్వారా రాజకీయంగా ఏపీలో ప్రయోజనం కలిగిందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు తెలంగాణలో కూడ కెసిఆర్ కు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం కావాలని రేవంత్ సూచించారు.

 మోత్కుపల్లి వ్యాఖ్యలను స్వాగతించిన కడియం

మోత్కుపల్లి వ్యాఖ్యలను స్వాగతించిన కడియం

తెలంగాణలో టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు చేసిన సూచనను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆహ్వనించారు. ఆనాడు ఎన్టీఆర్ పిలుపుతో తన లాంటి వారెందరో ఉద్యోగాలకు రాజీనామా చేసి టిడిపిలో చేరారని కడియం గుర్తు చేశారు. కెసిఆర్ పిలుపుతో తెలంగాణాభివృద్ది కొరకు టిఆర్ఎస్‌లో చేరారని ఆయన గుర్తు చేశారు.

 తెలంగాణలో నాయకులు వెళ్ళినా పార్టీకి ఇబ్బంది లేదు

తెలంగాణలో నాయకులు వెళ్ళినా పార్టీకి ఇబ్బంది లేదు

తెలంగాణలో టిడిపి నుండి నాయకులు బయటకు వెళ్ళిపోయినంత మాత్రానా నష్టం లేదని ఏపీకి చెందిన టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ గ్రామాన కార్యకర్తలున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టిడిపిదేనని బొండా ఉమా మహేశ్వర్ రావు గుర్తు చేశారు.ః

English summary
Telangana Congress party leader appealed that to united all parties against kcr in Telangana. Revanth reddy condmened motkupalli comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X