వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో సెక్స్ వర్కర్లు దాదాపు 9 లక్షలు, టాప్‌లో ఆంధ్రప్రదేశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశంలో దాదాపు తొమ్మిది లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారు. 8.6 లక్షల మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉన్నారు. సెక్స్ వర్కర్లు కలిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1.56 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు.

ఢిల్లీలో సెక్స్ వర్కర్లు 61వేలు ఉన్నారు. ఆ తర్వాత కర్నాటక, మహారాష్ట్రలు మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఏపీ, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలు ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు కలిగిన టాప్ ఫోర్ జాబితాలో ఉన్నాయి.

రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సోసైటీ సమాచారం ప్రకారం సెక్స్ వర్కర్లు 6.96 లక్షల మందిగా రిజిస్టర్ అయి ఉన్నారు. దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాబితాలో మొదటిస్థానంలో ఉంది.

Revealed: India is home to around 9 lakh female sex workers, Andhra tops

ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 1,36,794 మంది ఉన్నారు. కాగా ఈ సంఖ్య అనధికారికంగా 1,56,205గా ఉండవచ్చు. కర్నాటకలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 86,386 మంది ఉండగా ఈ సంఖ్య అనధికారికంగా 96,057గా సమాచారం.

మహారాష్ట్రలో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 85,416 మంది ఉన్నారు. అనధికారికంగా 79,586 మంది. తమిళనాడులో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 43,543 మంది ఉన్నారు. ఈ సంఖ్య అనధికారికంగా 70,732 ఉండవచ్చు.

పశ్చిమ బెంగాల్లో‌లో రిజిస్టర్డ్ మహిళా సెక్స్ వర్కర్లు 31,235 మంది కాగా అనధికారికంగా 57,850 మంది ఉన్నారు. 19 శాతం మంది సెక్స్ వర్కర్లు రిజిస్టర్ చేసుకోలేదు. కాగా, 2009 మ్యాపింగ్ స్టడీ ఆధారంగా దీనిని చెప్పారు. మహిళా సెక్స్ వర్కర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి కాదని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

English summary
Around 9 lakh female sex workers are currently working in India and Andhra Pradesh is home to 1.56 lakh sex workers highest in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X