వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ అంటే ఆంధ్రా పార్టీ అని కేసీఆర్ ముద్ర వేశారు ..అందుకే బీజేపీలో చేరానన్న రేవూరి

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు .1994, 1999 మరియు 2009 సంవత్సరాల్లో మూడుసార్లు నర్సంపేట్ అసెంబ్లీ సీటును గెలుచుకున్న రేవూరి ప్రకాష్ రెడ్డి తెలంగాణలో ఉన్న టీడీపీ బలమైన నాయకుల్లో ఒకరు . చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు . వాస్తవానికి, గత కొన్నేళ్లుగా ఆయన వరంగల్ జిల్లాలో పార్టీకి కీలక నేతగా ఉన్నారు. అలాంటి రేవూరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యం లో , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. నడ్డా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. లక్ష్మణ్‌ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి క్యాబినెట్ ఆమోదంఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి క్యాబినెట్ ఆమోదం

వరంగల్ జిల్లాలో టీడీపీ ఖాళీ .. రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరిక

వరంగల్ జిల్లాలో టీడీపీ ఖాళీ .. రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరిక

వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీకి దిశానిర్దేశం చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి పార్టీని వీడడంతో వరంగల్ లో టిడిపి దాదాపు ఖాళీ అయిందని చెప్పవచ్చు. బిజెపిలో చేరిన నేత రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తనకు టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఎలాంటి కోపం కానీ ,వ్యతిరేకత కానీ లేవని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న కెసిఆర్ పార్టీ మీద ఆంధ్ర పార్టీ అని ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరింది రాజకీయ పునరేకీకరణ కోసమేనని స్పష్టం చేశారు.

రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీలో చేరానన్న రేవూరి ప్రకాష్ రెడ్డి

రాజకీయ పునరేకీకరణ కోసమే బీజేపీలో చేరానన్న రేవూరి ప్రకాష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ చాలా అవసరమని, కెసిఆర్ ని ధీటుగా ఎదుర్కోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రేవూరి ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక అంతే కాదు కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవూరి చంద్రబాబు బీజేపీ లోకి వలసలు ప్రోత్సహిస్తున్నారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ తన వాక్చాతుర్యంతో తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీ అని ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కనుమరుగవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి నడిపించే నాయకుడే కరవయ్యాడని రేవూరి అన్నారు.

 చంద్రబాబు మీద కోపం లేదు .. తెలంగాణాకు న్యాయం చేసిన పార్టీ టీడీపీనే

చంద్రబాబు మీద కోపం లేదు .. తెలంగాణాకు న్యాయం చేసిన పార్టీ టీడీపీనే

తెలంగాణకు అన్ని విధాలా న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనని రేవూరి స్పష్టం చేశారు. తను పార్టీ వీడి బిజెపి లో చేరింది చంద్రబాబు మీద కోపంతోనో, టిడిపి మీద ద్వేషంతో నో కాదని ఆయన గట్టిగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. గత ఎన్నికల్లో మహా కూటమి పొత్తులతో పోటీ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాలి ప్రజలు. సీఎం కేసీఆర్ టిడిపి అంటే ఆంధ్ర పార్టీ అని ప్రజల్లో కలిగించినటువంటి భావన తెలంగాణలో టీడీపీకి చాలా ఇబ్బందికర పరిణామాలు తెచ్చిపెట్టింది. ఇక అంతే కాకుండా టిడిపి లోని ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా వలస బాట పట్టడం తెలంగాణలో టిడిపిని కుదేలు చేసింది. ఈ వరుస పరిణామాలతో అధికార పార్టీ పై పోరాటం చేయడానికి కావలసిన శక్తి టీడీపీ శ్రేణులకు లేనందున ప్రస్తుతం రేవూరి ప్రకాష్ రెడ్డి సైతం బిజెపి బాట పట్టారు. రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మాజీ ఎంపి రవీంద్రనాయక్ సైతం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

English summary
One last strong leader of the Telugu Desam Party (TDP), Revuri Prakash Reddy, joined the BJP in New Delhi in the presence of its national president J.P. Nadda. With this development, the TDP is only left with second-rung leaders.Mr. Reddy started his political career with the TDP in 1983 and was elected MLA three times from Narasampet Assembly constituency in the erstwhile Warangal district. He worked as party president for a long time and was also TDP Polit Bureau member till date. He was also the Public Accounts Committee chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X