వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బండిసంజయ్ కుమారుడు భగీరథ్‌‌పై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్; సోషల్ మీడియాలో ఆ వీడియోల రచ్చ!!

|
Google Oneindia TeluguNews

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వీడియో వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో దుమారంగా మారింది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఓ విద్యార్థిని విపరీతంగా కొడుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇక ఈ వీడియోలో బండి సంజయ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలు సైతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

బండి సంజయ్ కుమారుడు భగీరధ్ ఎపిసోడ్ పై ఆర్జీవీ ట్వీట్

బండి సంజయ్ కుమారుడు భగీరధ్ ఎపిసోడ్ పై ఆర్జీవీ ట్వీట్

ఇక తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఎపిసోడ్ పై వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇక ఈ వీడియో మీద బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద తనదైన స్టైల్ లో రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ రాజకీయ నాయకులకు సంబంధించిన అనేక అంశాల పైన స్పందించే రాంగోపాల్ వర్మ బండి సంజయ్ కుమారుడు ఎపిసోడ్ పైన కూడా తనదైన శైలిలో విచిత్రంగా స్పందించారు. బండి సంజయ్ కుమారుడిని ఓ నియంత కొడుకుతో పోలుస్తూ రాంగోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నియంత సద్దాం హుస్సేన్ తనయుడు ఉదయ్ హుస్సేన్ మళ్ళీ పుట్టాడని ట్వీట్

బండి సంజయ్ కుమారుడు విద్యార్థిని కొడుతున్న వీడియోను పోస్ట్ చేసి మరీ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో టార్గెట్ చేశారు. ఇరాక్ ను పాలించిన, ఇరాక్ ప్రజలను గజగజా మణికించిన నియంత సద్దాం హుస్సేన్ ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు అంతరించిపోయాయి. కానీ మళ్లీ ఇప్పుడు అతను బండి సంజయ్ కొడుకు భగీరథ్ రూపంలో పుట్టాడు అంటూ సంచలన ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇక ఈ ట్వీట్ ద్వారా బండి సంజయ్ ను, ఆయన కుమారుడు భగీరథ్ ను ఇద్దరినీ టార్గెట్ చేశారు. బండి సంజయ్ కుమారుడిని సద్దాం హుస్సేన్ కుమారుడైన ఉదయ్ హుస్సేన్ తో పోల్చడంతో పాటు, తండ్రిని మించిపోయాడు అని బండి సంజయ్ ను నియంత సద్దాం హుస్సేన్ తో పోల్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాం గోపాల్ వర్మపై కూడా ట్రోల్స్ ..

రాం గోపాల్ వర్మపై కూడా ట్రోల్స్ ..

ఇక వీరిద్దరిని నియంతలుగా పోల్చడంతో కొందరు ఏ కోణంలో అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు భగీరథ్ కు సంబంధించి మరికొన్ని వీడియోలను పంపిస్తాం సినిమా తీయండి అంటూ ఆర్జివికి ట్వీట్లు చేస్తున్నారు. ఇక బండి సంజయ్ పై ఆయన కుమారుడు పై పోస్ట్ పెట్టిన రాంగోపాల్ వర్మను ఉద్దేశించి కూడా పలువురు ట్రోల్ చేస్తున్నారు. నీ బతుకు అషు రెడ్డి కాళ్ళ దగ్గర అంటూ రాంగోపాల్ వర్మ ఫోటోలను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు మిడిమిడి జ్ఞానంతో ప్రతి దాంట్లో వేలు పెట్టడం మానేసి నిజాలు తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోవాలి రాంగోపాల్ వర్మ అంటూ హితవు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో రచ్చగా మారిన బండి సంజయ్ కుమారుడి ఎపిసోడ్

మొత్తానికి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. బండి సంజయ్ కొడుకు దాదా గిరి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బండి సంజయ్ కుమారుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. బండి సంజయ్ కుమారుడు మందు పార్టీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ అయ్య తంబాకు కొడుకు తాగుబోతు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఫుల్లుగా మందు కొడుతూ.. జల్సాలు చేస్తూ.. కాలేజీలో విద్యార్థుల మీద దౌర్జన్యం చేయాలి ఇది బండి సంజయ్ కొడుకు తీరు అంటూ.. ఇదే బండి సంజయ్ దేశం కోసం చెప్పే ధర్మమని విమర్శలు గుప్పిస్తున్నారు.

English summary
RGV shocking tweet on Bandi Sanjay's son Bhagirath. Bandi's son was compared to Uday Hussain, the son of the dictator Saddam Hussain who ruled Iran. Bandi Sanjay's son's videos continue to rage on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X