వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ విషయంలో చిన్న లాజిక్ మిస్: మహేష్ కత్తికి వర్మ దిమ్మతిరిగే సూచన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ మీడియాలో నానుతున్న మహేష్ కత్తికి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ దిమ్మతిరిగే షాకిచ్చారు. వర్మ చిత్రం ట్రయలర్‌ను మహేష్ కత్తి ప్రశంసించారు. అయితే వర్మ మాత్రం ఓ విధంగా ఆయన తీరును తప్పుబట్టారు.

మహేష్ కత్తి ఉద్దేశ్యపూర్వకంగా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని, తిడుతున్నారని అందరూ చెబుతున్నప్పటికీ వినడం లేదు. అసలు నాలుగు రోజుల పాటు ఆయన వదిలేసినా అభిమానులు ఆ తర్వాత మరిచిపోతారనే చిన్న లాజిక్ ఆయన మిస్ అవుతున్నారని అంటున్నారు.

కావాలనే పవన్ కళ్యాణ్‌పై

కావాలనే పవన్ కళ్యాణ్‌పై

కావాలనే మహేష్ కత్తి దురుద్దేశ్యంతో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. దీనికి తోడు ఇటీవల నటి పూనమ్ కౌర్‌కు వ్యక్తిగత విమర్శలు సంధించి విమర్శలు ఎదుర్కొన్నారు. పవన్‌ను విమర్శిస్తూ ఇన్నాళ్లు ఎదుర్కొన్న వ్యతిరేకత ఒక ఎత్తయితే, పూనమ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మరో ఎత్తు అయ్యాయి. తొలుత మహేష్ కత్తి మాట్లాడటం ఆపేయాలని చాలామంది భావిస్తున్నారు.

 ఆ డిబేట్‌లో మహేష్ కత్తి

ఆ డిబేట్‌లో మహేష్ కత్తి

తాజాగా, దర్శకులు రామ్ గోపాల్ వర్మ కూడా మహేష్ కత్తికి షాకిచ్చారు. ఓ ఛానల్ నిర్వహించిన డిబెట్‌లో ఆయన మాట్లాడారు. ఆయన దర్శకత్వం వహించిన జీఎస్టీ చిత్రంపై ఓ ఛానల్ డిబేట్ నిర్వహించింది. అందులో మహేష్ కత్తి కూడా పాల్గొన్నారు.

 అందరి నోటి నుంచి వచ్చిందే వర్మ నోటి నుంచి

అందరి నోటి నుంచి వచ్చిందే వర్మ నోటి నుంచి

ఈ సందర్భంగా మహేష్ కత్తి - పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ ఎలా ముగుస్తుందని అడగగా.. వర్మ సమాధానం చెప్పారు. ఆయన సింపుల్‌గా జవాబు చెప్పారు. అయితే మొదటి నుంచి అందరూ చెబుతున్నదే ఆయన నోటీ నుంచి వచ్చింది. మహేష్ కత్తి ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, ఇగ్నోర్ చేస్తే సమస్య ఆగిపోతుందని చెప్పారు.

 ఇగ్నోర్ చేయనని మహేష్ కత్తి

ఇగ్నోర్ చేయనని మహేష్ కత్తి

అయితే, మహేష్ కత్తి మాత్రం వర్మ సూచనకు నో చెప్పారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇగ్నోర్ చేయడం జరగదని తేల్చి చెప్పారు. తాను ముందుకే వెళ్తానని చెప్పారు. తద్వారా మహేష్ కత్తికే ఈ వివాదానికి ముగింపు పలకాలని లేదని అర్థమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Director Ram Gopal Varma suggestion to Mahesh kathi. But Mahesh Kathi says no to RGV suggetion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X