వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం గర్వించేలా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా: బాలకృష్ణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశం గర్వపడేలా ఎన్టీఆర్ బయోపిక్‌ను నిర్మిస్తామని హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ప్రకటించారు. ఎన్టీఆర్ బయోపిక్ తీసి ఆయన రుణం తీర్చుకొంటానని బాలకృష్ణ చెప్పారు.

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం నాడు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి గుండె చప్పుడని బాలకృష్ణ గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని వ్యాపింప చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం తాను కృషి చేయనున్నట్టు బాలకృష్ణ చెప్పారు. మార్చి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు.

Rich tributes paid to NTR on 22nd death anniversary ,Jr NTR, Kalyan Ram

అంతకుముందు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.పేదవాడికి సంక్షేమ పథకాలను అమలు చేసింది ఎన్టీఆర్ అని మాజీ ఎంపీ, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ అభిప్రాయపడ్డారు. సంస్కరణలకు ఎన్టీఆర్ ఆద్యుడుగా నిలుస్తారని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు, పార్టీలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ నాంది పలికారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఒకేసారి వచ్చి ఎన్టీఆర్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయులు హరికృష్ణతో పాటు ఇతర కుటుంబసభ్యులు కూడ వచ్చారు. సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు.

Rich tributes paid to NTR on 22nd death anniversary ,Jr NTR, Kalyan Ram

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు వాణిని ఖండాంతరాల్లో వినిపించారు ఎన్టీఆర్. తెలుగు భాష ఉన్నంత వరకు ఎన్టీఆర్ జీవించే ఉంటారని చెప్పారు. మే 28న, ఎన్టీఆర్ పుట్టిన రోజున అందరి ఇంట్లో సంతోష దినం, ప్రతి ఇంటా పుట్టిన దినమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలను అన్ని రాజకీయ పార్టీలు మార్చి అమలు చేస్తున్నాయి. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ పునాదిరాయి వేశారని హరికృష్ణ గుర్తు చేశారు. ప్రాణత్యాగం చేసి ఆంద్రరాష్ట్రాన్ని సాధించారని హరికృష్ణ గుర్తు చేశారు. ఎందరో మహనుభావులను కలగలుపే ఎన్టీఆర్ అని హరికృష్ణ అభిప్రాయపడ్డారు.

English summary
Family members of NTR paid rich floral tributes to legendary actor and TDP founder, late united AP Chief Minister NT Rama Rao on Thursday on the occasion of his 22nd death anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X